జడ్చర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతూ ఉండడంతో రిజిస్ట్రేషన్ లన్ని స్తంభించిపోయాయి.
డాక్యుమెంట్ రైటర్స్ దుకాణాలు మూసికొని వెళ్లిపోయారు. డాక్యుమెంట్ రైటర్స్ కొందరి ఫోన్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఒక ఏసీబీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏమైనా అవకతవకలు జరిగాయా, అలాగే ఉద్యోగుల యొక్క హాజరు రిజిస్టర్ లో వివరాలు పరిశీలిస్తున్నామని సోదాలు పూర్తయిన తర్వాత మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Tags
Jadcherla