హోంగార్డు పరీక్షలో స్పృహ కోల్పోయిన మహిళ, అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం

బీహార్‌లోని బుద్ధగయా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. హోంగార్డు నియామక పరీక్షల్లో పాల్గొన్న 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఫిజికల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు కుప్పకూలిపోయిన సదరు యువతిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా సిబ్బంది అత్యంత నికృష్టంగా ప్రవర్తించారు. కదులుతున్న అంబులెన్స్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ఇలా సదరు బాధిత యువతి ఆరోపిస్తుండటం ఇప్పుడు బీహార్ లో సంచలనంగా మారింది.

బుద్ధి గయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న హోంగార్డు నియామక పరీక్షల సందర్భంగా జూలై 24న ఈ దాడి జరిగిందని సదరు యువతి ఆరోపిస్తోంది. నియామక పరీక్షల్లో భాగంగా శారీర దారుఢ్య పరీక్షను నిర్వహిస్తున్నప్పుడు ఆ మహిళ స్పృహ కోల్పోయింది అని పోలీసులు తెలిపారు. దీంతో పరీక్ష నిర్వాహకులు ఆమెను వెంటనే అక్కడ ఉంచిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే, అంబులెన్స్ లోపల పలువురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించింది.

దీంతో బాధిత మహిళ స్టేట్‌మెంట్ తీసుకుని, బోధ్ గయా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి సిట్, ఇంకా ఫోరెన్సిక్ బృందాన్ని నియమించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే, సిట్ ఇద్దరు అనుమానితులైన అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, అంబులెన్స్‌లో ఉన్న టెక్నీషియన్ అజిత్ కుమార్‌లను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాహనం మార్గం, కాలక్రమాన్ని నిర్ధారిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు నమోదు చేసిన బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. ఫిజికల్ టెస్ట్ సమయంలో తాను స్పృహ కోల్పోయానని, ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో జరిగిన దానిపై తాను పాక్షికంగా మాత్రమే తెలుసుకున్నానని ఆ మహిళ పేర్కొంది. అంబులెన్స్ లోపల ఉన్న ముగ్గురు లేదా నలుగురు తనపై అత్యాచారం చేశారని చెప్పింది. తర్వాత పోలీసులకు, ఆసుపత్రి అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనపై లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎంపీ చిరాగ్ పాస్వాన్ స్పందించారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిని పాశ్వాన్ విమర్శించారు. రాష్ట్ర పోలీసుల పనితీరును ఆయన ప్రశ్నించారు.

బుద్ధి గయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న హోంగార్డు నియామక పరీక్షల సందర్భంగా జూలై 24న ఈ దాడి జరిగిందని సదరు యువతి ఆరోపిస్తోంది. నియామక పరీక్షల్లో భాగంగా శారీర దారుఢ్య పరీక్షను నిర్వహిస్తున్నప్పుడు ఆ మహిళ స్పృహ కోల్పోయింది అని పోలీసులు తెలిపారు. దీంతో పరీక్ష నిర్వాహకులు ఆమెను వెంటనే అక్కడ ఉంచిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే, అంబులెన్స్ లోపల పలువురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించింది.

Previous Post Next Post

نموذج الاتصال