హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తుండగా కారం చల్లి..
హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సీపీఐ నేత చందూరాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చందూ హత్యకు పాతకక్షలు కారణంగా ప్రాథమిక అంచనా వచ్చారు. హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సీపీఐ నేత చందూరాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. వాకింగ్‌కి వెళ్లిన చందూ రాథోడ్‌పై దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సీపీఐ నేత రాజేష్‌తో రాథోడ్‌కు విబేధాలున్నాయని.. అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని.. రాథోడ్ కుటుంబసభ్యులు రాజేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగరకర్నూల్ జిల్లా అచ్చంపేటకి చెందిన చందూ రాథోడ్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా చైతన్యపురిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో వాకింగ్ కు వెళ్లాడు.. వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రాథోడ్‌పై దుండగులు కాపు కాచి కాల్పులు జరిపారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. ముందు మృతుడి కళ్లలో కారం చల్లారు.. ఆ తర్వాత పరిగెత్తుతున్న అతడిని వెంటాడి వెంబడించి గన్‌తో 4 రౌండ్ల కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆపై స్విఫ్ట్ కారులో దుండగులు పరారయ్యారు. రాథోడ్ పై ఐదుగురు వ్యక్తులు కలిసి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చందూ హత్యకు పాతకక్షలు కారణంగా ప్రాథమిక అంచనా వచ్చారు.
Tags
Nagar Kurnool