*ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి.*
*బాధ్యత గల వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేయొద్దు..*
*కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదు..*
*గతంలో జడ్చర్లలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు..*
*వంద పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం నేను రెండు ఎకరాలు ఇచ్చాను..*
*ఎమ్మెల్యే గారు పక్కన ఉన్న మరో రెండు ఎకరాలు ఇప్పించాలి..*
*ప్రభుత్వం మీది ..బిఆర్ఎస్ నేతల అవినీతి, కబ్జాలు నిరూపించాలి..*
*నిరూపిస్తే పార్టీపరంగా కూడా చర్యలు తీసుకుంటాం.*
*బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు*
*నా రాజకీయ జీవితం లో అవినీతి చేయలేదు.*
*జడ్చర్ల ప్రేమ్ రంగా గార్డెన్స్ లో ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి.సి.లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ...*
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.మా మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.బాధ్యత గల వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేయొద్దన్నారు.జడ్చర్ల రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగడం ఎప్పుడు లేదన్నారు.జడ్చర్ల ఎమ్మెల్యే గా అవకాశం వచ్చింది మాకు చేతనైన అభివృద్ధి చేశామన్నారు.తరువాత వచ్చిన వాళ్ళు ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలన్నారు.మా అక్క మీద రెండు ఎకరాల భూమి ఎక్కడుందో నిరూపిస్తే ఇచ్చేస్తామన్నారు.వంద పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం రెండు ఎకరాలు కొని నిర్మాణం చేస్తే మా మీద ఆరోపణలు చేయడమేంటన్నారు.ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పక్కనే ఉన్న మరో రెండు ఎకరాలు కూడా హాస్పిటల్ కి ఇప్పించాలన్నారు.జడ్చర్ల నియోజకవర్గం లో చాలా చోట్ల అసైన్మెంట్ ల్యాండ్ తీసుకొని వారికి డబ్బులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సొంత గ్రామం లో కూడా ఇదే విధంగా చేశామని తెలిపారు.
హాస్పిటల్ రోడ్డు నిర్మాణం కోసం అయ్యే ఖర్చు భరిస్తానని తెలిపారు.పాత బజారు కి భారీ వాహనాలు వెళ్లాడానికి ఎటువంటి ఇబ్బంది లేదని..అంబేద్కర్ చౌరస్తా వద్ద డివైడర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు.స్లో అయ్యి రైట్ తీసుకొని వెళ్లొచ్చన్నారు.ఎర్రగుట్ట లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్దిదారులకు దక్కాలన్నారు.అర్హులైన వారికి కేటాయించి మిగతా వారిని ఖాళీ చేయిస్తే మాకేం అభ్యంతరం లేదన్నారు.ఎన్నికల తరువాత ఇండ్లను కొంతమంది ఆక్రమించుకుంటే మాకేం సంబంధం అన్నారు.అయినా అధికారులు విచారణ చేపట్టి నిజమైన లబ్దిదారులకు ఇండ్లు కేటాయించాలన్నారు.ఉద్దండపూర్ పరిహారం విషయం లో ఎలాంటి అవకతవకలు జరగలేదని...కెసిఆర్ నీ ఒప్పించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ముప్పై శాతం పెంచామని గుర్తు చేశారు.మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు.