*ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులపై కౌన్సిలింగ్ నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా వుమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్*
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, యువతులకు భద్రత మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, మహిళలపై జరిగే ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటి ద్వారా జరిగే వేధింపులపై జిల్లా షి టీమ్ సిబ్బందికి వచ్చిన కంప్లైంట్ పై ప్రత్యేక కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ వుమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు నేతృత్వంలో నిర్వహించారు.
అమ్మాయిలు తగిన విధంగా సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల భద్రతపై అవగాహన పెరుగుతుందని, వేధింపులపై తీవ్రంగా స్పందిస్తామని అధికారులు తెలిపా
రు.