KCR New Plan: కేసీఆర్ కొత్త ఫార్ములా.. 19న భేటీ అందుకేనా?


 KCR New Plan: బీఆర్ఎస్ కొత్త ప్లానేంటి? ఫిబ్రవరి 19న జరగనున్న పార్టీ సమావేశం ఎజెండా ఏంటి? పార్టీలో ఉండే నేతలు ఎవరు తెలుసుకోవడానికేనా? ఈ భేటీ తర్వాత కారు పార్టీకి క్లియర్ పిక్చర్ వస్తుందా? దాదాపు మూడు లేదా నాలుగు అంశాలు సిద్ధం చేశారా? రాబోయే రోజుల్లో పార్టీ అజెండాను ఆవిష్కరించనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి యాక్టివ్ రాజకీయాల్లోకి కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. ఆ తర్వాత ఫామ్ హౌస్‌కు ఆయన పరిమిత మయ్యారు. ఎవరైనా నేతలు, కార్యకర్తలు వస్తే వారితో కాసేపు ముచ్చటిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా పార్టీ ఆఫీసుకు సైతం దూరమైన సందర్భాలు లేకపోలేదు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడంతో కేసీఆర్ పనైపోయిందనే చర్చ జరుగుతోంది. కనీసం అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించాలని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెప్పినప్పటికీ బయటకు రాలేదు. మీటింగ్ అజెండా?

ఫిబ్రవరి 19 నాటికి బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో పార్టీ సిల్వర్ జూబ్లీవేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ఆ పార్టీ. ఈ క్రమంలో అదే రోజు మాజీ సీఎం కేసీఆర్ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికితోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది. రేవంత్ సర్కార్‌కు ఏడాది సమయం ఇవ్వాలని భావించారు కేసీఆర్. అన్నట్టుగానే ఆయన ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి అయ్యింది. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

మారిన ఎమ్మెల్యేలపై కొత్త స్కెచ్

కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత కారు పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నాయి. ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. న్యాయస్థానం తీర్పు వచ్చేలోపు బీఆర్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలున్నట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. ఫిబ్రవరి 19న పార్టీ సమావేశం వల్ల కొత్త పిక్చర్ వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఆ రోజు సమావేశానికి రాని నేతలు మిగతా పార్టీలకు వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. కచ్చితంగా కీలక నేతలంతా 19న మీటింగ్ కు వస్తారని అంటున్నారు. వచ్చే నేతలెవరు? రాకుండా ఉండేదెవరు? తెలుసుకునేందుకు హైకమాండ్ ఈ స్కెచ్ వేసిందని అంటున్నారు.

v

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me