Delhi Election Results 2025: తగ్గేదేలే.. ఒక్కో రాష్ట్రం.. పక్కా విజయం.. అంతటా కమ్మేస్తున్న కమలం
పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రోలెవల్లో ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీ లోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించింది.
పార్టీ కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆపార్టీనే పుష్ప..పార్టీ ఉంది పుష్ప.. ఎంతవారు గానీ… ప్రజాతీర్పు ముందు శిరసా వహించాల్సిందే… సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగినా… ప్రజాస్వామ్యానికి తలవంచాల్సిందే.. తినగా తినగా తీపి కూడా చేదే…. ఎంతవారు కానీ ప్రజావ్యతిరేక వ్యక్తమైతే…అధికారానికి దూరమే… కానీ అదేంటో ప్రదాని మోదీ విషయంలో ఎంతవారు గానీ…మోదీ చరిష్మా ముందు జీ హుజుర్ అనాల్సిందేనా అన్నట్టుగా మారింది. తినగా తినగా వేప కూడా తీపే అన్నట్టుగా మారింది మోదీ ఇమేజ్. 2014నుంచి అప్రహిత విజయాలతో.. విపక్షాలకు సాధ్యంకాని రికార్డులతో….అసమాన్య వ్యూహాలతో…దూసుకుపోతోంది కమలం. విపక్షాల కంచుకోటలను బద్దలు కొడుతూ.. ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా కమలం జెండా పాతింది మోదీ-షా ద్వయం.. 27ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం దద్దరిల్లింది.సామాన్యుడిగా వచ్చి..అసమాన్యుడిగా ఢిల్లీగద్దెనెక్కి కూర్చున్నమప్లర్‌వాలా కేజ్రీవాల్ అటు కాంగ్రెస్‌కు ఇటు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. 12ఏళ్ల అధికారాన్ని చాయ్‌వాలా మోదీ మట్టికరిపించారు. ఈజన్మలో కాదు..కదా వచ్చే జన్మలో కూడా ఢిల్లీ పీఠంనుంచి ఆప్‌ను దించే దమ్ముందా మోదీ అంటూ ఝీంకరించిన ఆప్ అధినేతకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కమలం.
నార్త్‌గేట్‌లో బీజేపీకి తిరుగులేదు. కానీ ఢిల్లీ తప్ప…అన్నట్టుగా 27ఏళ్లుగా బీజేపీని దూరం పెడుతూ..లోక్‌సభ ఎన్నికల్లో కమలానికి జై కొడుతూ…అసెంబ్లీకొచ్చేసరికి ఆప్‌కు ఆదరణ పెంచుతూ వచ్చింది ఢిల్లీ ప్రజానీకం. కానీ ఈసారి హస్తనపై పాగావేయాలని పంతం పట్టిన కమలనాథులు….సరికొత్త వ్యూహాలతో ఆప్‌ను అదను చూసి దెబ్బకొట్టారు. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం, స్థానిక సమస్యల పరిష్కారం, ఉచిత’ వ్యూహాలు ఒక్క ఛాన్స్ అంటూ ముమ్మరంగా ప్రచారం కొనసాగించిన బీజేపీకే జైకొట్టింది హస్తిన ప్రజానీకం. కాంగ్రెస్ చూస్తే బోలెడంతమంది స్టార్ క్యాంపెయనర్లు. రాహుల్, ప్రియాంక ఇలా కాంగ్రెస్ అగ్రనాయకత్వమంతా కాళ్లకు బలపం కట్టుకు తిరిగింది. కానీ ఢిల్లీ ఓటరు నమ్మలా….ఇక ఆప్‌ను… అంతా తానై నడిపించారు కేజ్రీవాల్. పైగా ఆప్ గెలిస్తే సీఎం ఎవరోకూడా ప్రజలకు క్లారిటీ ఉంది. మరోసారి గెలిచేందుకు కేజ్రీవాల్ ఉచిత పథకాలను పారించారు..అలివిమాలిన హామీలను గుమ్మరించారు. మహిళలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానంటూ వాగ్దానాలు చేశారు…అయినా ప్రజలు నమ్మలా….కానీ బీజేపీ ప్రత్యర్ధుల రాజకీయ ఎత్తులను చిత్తూ చేస్తూ పక్కా వ్యూహంతో ఎన్నికల్లోకి వెళ్లింది. ఎలాగైనా ఢిల్లీ కొటను బద్దలు కొట్టాలన్న దృఢ సంకల్పంతో … ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని చెప్పకుండానే బరిలో దిగింది. ప్రచారంలో ప్రధాని మోదీ స్టార్ క్యాంపెయినర్. ఇక అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లు తమ వంతు ప్రచారం నిర్వహించారు. అంతేకాదు కమలానికి స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడాన్ని ప్రధానాస్త్రంగా తీసుకున్న ఆప్.. సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో కాషాయ పార్టీ విఫలమైందని ప్రచారం చేసింది. కానీ అదేమీ ఫలించలేదు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లలో ఘన విజయం సాధించగా.. ఆప్ 22 స్థానాలకే కైవసమైంది.. ఆక కాంగ్రెస్ పార్టీ అయితే.. ఖాతా కూడా తెరవలేదు..
పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రోలెవల్లో ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీ లోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పెద్దఎత్తున పరివర్తన్ ర్యాలీలు చేపట్టి ‘ఆప్ దా నహీ సహేంగే, బదల్ కర్ రహేంగే అంటూ సాగిన ప్రసంగాలు ఓటర్లపై ప్రభావం చూపాయి. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన లిక్కర్ స్కాం, ఆప్ ఛీప్ కేజ్రీవాల్ జైలుకెళ్లడంతో పాటు శీష్ మహల్ అవినీతి అంశాన్ని కూడా బీజేపీ అస్త్రాలుగా చేసుకోవడంతో బీజేపీకి లాభించింది. అలాగే ప్రజాకర్షణ పథకాలతో ఆప్‌కు పేద మధ్య తరగతి వర్గాల్లో ప్రజాదరణ ఉన్నా స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. ముఖ్యంగా యమునా కలుషితం కావడం, తాగు నీటి కొరత, పాడైన రహదారులు, ప్రజా రవాణాలో పలు సమస్యలతో పాటు ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ పాయింట్లయ్యాయి. నియోజకవర్గాల వారీగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై ‘చార్జీ షీట్లు’ విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రెట్టింపయిందన్నది విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ ఒత్తిడితో కేసులు బనాయించి ఆప్ నేతలను వేధిస్తోందని ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేసినా ఆశిం చిన మేరకు వర్క్‌వుట్ కాలేదు. మూడు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేజ్రీవాల్ కు ప్రజాదరణ ఉన్నా పార్టీలో ఇతర నేతలు ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఆప్‌కు నష్టం చేకూర్చింది. చివరకు కేజ్రీవాల్ కూడా ఓడిపోయే పరిస్థితికొచ్చింది. ఇండియా’ గ్రూపులో ఆప్, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములైనప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో ఆప్ కు నష్టం కలిగింది. ఆప్ కు వెనుదన్నుగా నిలుస్తున్న ముస్లిం, దళిత ఓట్లను కాంగ్రెస్ చీల్చడంతో ఆప్ ఓటమి ఖాయమైంది.
ఇక మహిళల ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వరాల జల్లు కురిపించాయి. ఢిల్లీలో 71 లక్షల మహిళా మంది ఓటర్లు ఉన్నారు. 2020లో ఆప్‌నకు 60 శాతం ఓట్లు రాగా..బీజేపీకి దక్కిన వాటా మాత్రం 35 శాతమే. కానీ ఈసారి రివర్స్ ట్రెండ్ కనిపించింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని కమలం హామీ ఇచ్చింది. అంతేకాకుండా గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇదే తరహా హామీలు ఇతర పార్టీలుఇచ్చినా ప్రజలు బీజేపీవైపే మొగ్గుచూపారు.
ఇక కాంగ్రెస్-ఆప్ విడివిడిగా పోటీ చేయడం కూడా బీజేపీకి లాభించింది. ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆప్-కాంగ్రెస్ హర్యానా ఎన్నికల నుంచి విడివిడిగా పోటీ చేస్తూ వచ్చాయి. ఢిల్లీ ఎన్నికలోనూ అదే ఫార్ములాతో ముందుకు వెళ్లాయి. కొట్టుకున్నాయి. పరస్పరం దూషించకున్నాయి. రెండు పార్టీలు 70స్థానాల్లో పోటీ చేశాయి.వీటితోపాటు బీఎస్పీ, లెఫ్ట్, ఏఐఎంఐఎం, ఆజాద్ సమాజ్‌పార్టీ, ఎన్‌సీపీ కూడా ఎన్నికల్లో తలపడటం కూడా ఆప్‌కు తీవ్ర నష్టం కలిగించాయి. ఓవైపు ఎన్డీఏలో ఐక్యత కనిపిస్తే…ఇండియా కూటమిలో అనైక్యత స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ..జమ్మూకాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా … మనం మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని…ఇంకా కొట్టుకోండి.. మీ మనస్సుకు నచ్చినంత వరకు పొట్లాడండి.. ఒకరినొకరు కొట్టుకోండి అని రాసి ఉన్న జిఫ్ ఇమేజ్ పోస్ట్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో బిగ్ గేమ్ చేంజర్ మాత్రం బడ్జెట్‌లో ప్రకటించిన పన్నువరాలు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచడం… తర్వాత వెంటనే 5వతారీఖు పోలింగ్ జరగడం…బీజేపీ బాగా లాభించిందంటున్నారు విశ్లేషకులు. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షలాదిగా ఉండటం కాషాయ పార్టీకి బాగా కలిసొచ్చింది. దీనికి తోడు జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటుచేస్తున్నట్లు గత నెల కేంద్రం ప్రకటించింది.ఇది కూడా ఎన్నికల్లో పనిచేసింది. ఢిల్లీ ప్రజలు తనకు “నిజాయితీ సర్టిఫికేట్” ఇస్తేనే తాను తిరిగి పదవికి వస్తానని గతంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఆసర్టిఫికెట్ తమ నుంచి రాదన్న సంకేతాలు ఈఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా ఇచ్చారంటూ ఆప్ ఓటమిపై సోషల్ మీడియా అంతా సెటైర్లతో నిండిపోయింది.
ఎవరేమనుకున్నా సరే.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకితిరుగులేదు. తన బీజేపీ కోసం.. ఆయన యోధుడిలా రంగంలోకి దిగి, విస్తృతస్థాయిలో ప్రచారాలు చేపడతారు. ఏడు పదుల వయసు దాటినప్పటికీ.. ఓ యువకుడిలాగా దూసుకుపోతారు. ఎంత కష్టమొచ్చినా సరే.. దాన్ని అధిగమించి ముందుకు సాగిపోతారు. ప్రతి ఎన్నికల ప్రచారంలో మోదీ ఎంత జోరుగా, హుషారుగా పాల్గొన్నారో అందరూ చూశారు. ప్రతిరోజూ ఆయన యావరేజ్‌గా మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సుడిగాలిలా నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. ఎక్కడా అలసటన్నది కనిపించకుండా.. ప్రజల్లో హుషారు పెంచేలా ఆయన ప్రసంగాలు ఉంటాయి..
2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యలు చేపట్టినప్పటి నుంచి…దేశంలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఎన్నికల సమయంలో పగ్గాలు దక్కించుకున్న అనేక మంది రాష్ట్ర స్థాయి నేతలు, జాతీయ నేతలు కూడా తెరమరుగు అయ్యారు. అయితే ప్రధాని హోదాలో మోదీ హవా మాత్రం పుష్కర కాలం నుంచి ఏమాత్రం తగ్గలేదు. 2014 ఎన్నికల్లో మంచి మెజారిటీతోనే ఎన్డీయే కూటమి అంచనాలకు మించి విజయాన్ని దక్కించుకుంది. అప్పుడే బీజేపీకి దాదాపు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చినా, కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో మోదీకి ఎదురుదెబ్బే అన్న విశ్లేషణలొచ్చాయి. అ అంచనాలతో ఎంతోమంది బీజేపీతో తెగదెంపులు చేసుకుని…కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ఈవెన్ ఏపీలో కూడా టీడీపీ బీజేపీని దూరంగా పెట్టింది. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ…2019లో విజయఢంకా మోగించారు మోదీ. ఓరకంగా 2014తో పోలిస్తే 2019లోనే సీట్లు ఎక్కువొచ్చాయి.
మామూలుగా ఏపార్టీకైనా రెండు ధపాలు పాలించినతర్వాత సీట్లు తగ్గడమో..లేక పూర్తిగా ఓడిపోవడమే జరుగుతుంది. కానీ మోదీ విషయంలో మాత్రం ఈసంప్రదాయం నిజం కాలేదు. బీజేపీ రాజకీయం అంతా మతం, జాతీయ వాదం అనే ఎమోషన్లతోనే సాగుతోందనే విశ్లేషణ మొదటి నుంచి ఉంది. అయితే కేవలం ఎమోషనే అయితే.. మరీ ఇంత కాలం రాజకీయ మనుగడ సాధ్యమా.. ఇలాంటి భారీ విజయాలు వరిస్తాయా…? పైగా మోదీ ప్రధాని అయ్యాక చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాలు లేవంటారు విశ్లేషకులు. ఇంకా లెక్కలేనన్ని సబ్సిడీలు ఎత్తేశారని కూడా విపక్ష పార్టీలు ప్రచారం చేశాయి. అయినా సరే..మోదీపై ప్రజల్లో విశ్వాసం ఇసుమంత కూడా తగ్గలేదు.
ప్రజాకర్షక పథకాలు లేకపోయినా..నోట్ల రద్దు వంటి రాత్రికి రాత్రి నిర్ణయాలు వికటించాయంటూ విశ్లేషణలు వచ్చినా.. జీఎస్టీతో బాదుడు మరింత పెరిగిదంటూ విపక్షాలు విమర్శలతో విరుచుకుపడ్డా ఏవీ ప్రజల చెవిన పడలేదు. అప్పుడప్పుడూ ఆయిల్ ధరలు పెరిగినా…నిత్యావసరాలు చుక్కలు చూపించినా…మధ్యతరగతి మాత్రం మోదీపై విశ్వాసమే చూపించారు. దాని ఫలితమే ఐటీ టాక్స్ 12లక్షలకు పెంచడం అంటారు అనలిస్టులు.
అంతెందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు నెలలకే హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హర్యానాలో బీజేపీకి చాన్సే లేదని అక్కడ అధికార వ్యతిరేకత కొండంత పేరుకుపోయిందని దానికి ఏ మోదీ మ్యాజిక్ కూడా విరుగుడు కాదని సర్వే సంస్థలన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష ఫలితాలను ఇచ్చాయి. అదే సమయంలో కశ్మీర్‌లో హంగ్ ఏర్పడిన కాంగ్రెస్ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎక్కువ మంది అంచనా కట్టారు. ఎందుకంటే జమ్మూలో హిందువులు మెజార్టీలుగా ఉన్న చోట్ల బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. లోయలో ముస్లింలు మెజార్టీ. అక్కడ బీజేపీ పోటీ ఇచ్చినా గెలిచేంత ఉండదు. ఆ విషయంలో బీజేపీ నేతలకూ తెలుసు. అందుకే వీలైనన్ని ఎక్కువ సీట్లు టార్గెట్ పెట్టుకుని అనుకున్నది సాధించారు. లక్కీగా పీడీపీతో పాటు ఇండిపెడెంట్లు అనుకున్నంతగా ప్రభావం చూపకపోవడంతో కాంగ్రెస్ కూటమిలోని పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు 40కిపైగా సీట్లు వచ్చాయి. అన్ని సీట్లు వస్తాయని ఒమర్ అబ్దుల్లా కూడా అనుకుని ఉండరేమో… ఎలా అయితేనేమీ కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమికి అధికారం చిక్కింది. కానీ అక్కడ బీజేపీ ఓటమి అని తేల్చలేం. కానీ హర్యానాలో మాత్రం బీజేపీ శూన్యం నుంచి విజయాన్ని పుట్టించిందని చెప్పుకోక తప్పదు. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ చేతకాని తనం అంటారు విశ్లేషకులు.
2024 లోక్ సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని కొన్ని ఎంపీ సీట్లు తగ్గినా.. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన తీరును చూసినా, ఢిల్లీలో ఆప్ తుడిచిపెట్టుకుపోయి బీజేపీ పాగా వేస్తుందనే అంచనాల నేపథ్యంలో చూస్తే.. రాజకీయంగా ఇప్పుడప్పుడే మోదీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం అవుతోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ అలా వరస విజయాలు సాధించుకుంటూ పోతే.. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ మరింత బలలమైన ప్రభావాన్ని చూపేఅవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే శక్తే లేదని దానికి ముఖాముఖి జరుగుతున్న ఎన్నికల్లో వెల్లడి అవుతున్న ఫలితాలే నిదర్శనం అంటారు అనలిస్టులు. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటి, అరా తప్ప మొత్తం బీజేపీ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ ఇలా హిందీ బెల్ట్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కాంగ్రెస్ విజయం సాధించడం లేదు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్,తెలంగాణల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తరలపడిన మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో బీజేపీ గెలిచింది. సర్వేల అంచనాలు కూడా ఆ ఎన్నికల్లో తారుమారు అయ్యాయి. ఇక బీజేపీని ఓడించింది కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే. కానీ లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి ఆ ఎన్నికల్లోనూ బీజేపీనే క్లీన్ స్వీప్ చేస్తోంది. అంటే.. అతి కష్టం మీద అసెంబ్లీలో గెలిచినా ఆ పట్టును నిలబెట్టుకోలేకపోతోంది. ఇక యూపీలో బీజేపీ అజేయశక్తిగా మారింది. గుజరాత్ లో ఒకటి, రెండు సీట్లు ఆశించడం కూడా కష్టమే. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలమైన పోటీ ఇస్తుందో చెప్పలేని పరిస్థితి. సో..కనుచూపు మేరలో మోదీ ని ఢీకొట్టగల సమర్ధవంతమైన నేత లేడనే అంటున్నారు విశ్లేషకులు..