Naga Sadhu – Aghori : నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు


 Naga Sadhu – Aghori : అఘోరీలు, నాగసాధువులు ఒక్కటి కాదా..? రూపంలోనూ వారు వేషే వేషధారణలోనూ తేడాలెందుకుంటాయి..? అందరూ సింపుల్‌గా సన్యాసులు అంటారు కదా..? ఆ కేటగిరీలోకి అఘోరీలు కానీ నాగసాధువులు కానీ రారా..? అసలు అఘోరీలు పూజించేదెవరిని..? నాగసాధువులు ఆరాధించేదెవరిని..? ఈ కథనంలో తెలుసుకుందాం. హిందూ మతంలో ఎన్నో రకాల సాధు సంతులు ఉంటారు. వారందరిలోకి ఎప్పుడూ స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపించేది మాత్రం అఘోరీలు, నాగసాధువులు. అయితే చాలా మంది.. అఘోరీలు, నాగ సాధువులు ఒక్కటే అనుకుంటారు. కానీ వారిద్దరి మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఒంటి మీద కప్పుకునే బట్టల నుంచి తినే తిండి వరకు ఇరు వర్గాల మధ్య ఎక్కడా సారూప్యత కనిపించదు. కానీ వారిద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే.. మోక్షం కోసం పయనించడం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడకపోవడం. అంటువంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నాగసాధువులు: వీరినే నాగాలు అని కూడా అంటారు. నాగసాధువులు బాహ్య ప్రపంచాన్ని అసలు పట్టించుకోరు. పుష్కరాలకో.. కుంభమేళాలకో వీరు జన జీవన స్రవంతిలోకి వస్తారు. తర్వాత మళ్లీ ఎవరి కంటికి కనిపించరు. నదీ పరివాహక ప్రాంతాల్లో హఠాత్తుగా ప్రత్యక్షమై నదీ స్నానాలు ఆచరించిన  మళ్లీ మూడో కంటికి కనిపించకుండా మాయమై పోతుంటారు. వీళ్లు నదుల దగ్గరకు వస్తున్న టైంలో కానీ.. తిరిగి వెళ్లున్న సమయంలో కానీ ఎక్కడా రోడ్ల మీద కానీ ఊర్లలో కానీ పట్టణాలలో కనిపించరు. వీరి రాక పోక అంతా కూడా రహస్యంగానే జరుగుతుంది. వాళ్లు ఎలా వస్తారు. ఎలా వెళ్తారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నాగసాధువుల రావడం పోవడం మీద ప్రపంచ ప్రఖ్యాత సైటింస్టులు కూడా ప్రయోగాలు చేసి కనిపెట్టాలని చూశారు. కానీ వారి ప్రయోగాలకు కూడా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది నాగాల జర్నీ. ఇక నాగాలు మోక్ష సాధన కోసం అత్యంత కఠినమైన జీవితాన్ని గడుపుతారు. తీవ్రమైన తపస్సు చేయడం ద్వారానే మోక్షానికి వెళ్లగలమని నాగ సాధువులు బావిస్తారు. అయితే ఈ నాగ సాధువులను తయారు చేసింది మాత్రం శ్రీ ఆదిశంకరాచార్యులు అని హిందూ గ్రంథాల్లో ఉంది.  హిందూ ధర్మాన్ని రక్షించడమే పరమావధిగా వీరు జీవిస్తుంటారు. ఎప్పుడూ శివ నామస్మరణ చేసే నాగ సాధువులు మంత్ర తంత్రాలతో పాటు అస్త్రాలను ఎలా ఉపయోగించాలో కూడా శిక్షణ తీసుకుంటారు. వీరి చేతుల్లో ఎప్పుడూ త్రిశూలాలు, కత్తులు బల్లెలు లాంటివి ఉంటాయి.  నాగ సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు.

అఘోరాలు: అఘోరా అంటే సాధారణ లేదా ఎలాంటి సంబంధం లేనివాడు అని అర్థం వస్తుంది.  నాగసాధువులకు పూర్తి భిన్నంగా అఘోరీల జీవితం ఉంటుంది. అఘోరాలు వామాచార పద్దతిని నమ్ముతారు. వామాచార పద్దతి అంటే మంత్రాలు, తంత్రాలు.. దశమహావిద్యలు, క్షుద్రం కూడా నేర్చుకుంటారు. భూమ్మీద ఉన్న ప్రతిదానిని మోక్షాన్ని పొందే సాధనంగా చూస్తారు అఘోరీలు. వీరు ఎక్కువగా స్మశానాలలో జీవిస్తుంటారు. మోక్షం కోసం వీళ్లు చేసే తంత్ర ప్రక్రియలు చాలా ఆశ్చర్యంగానూ.. భయానకంగానూ ఉంటాయి. అఘోరాలు దత్తాత్రేయుడిని, శివుడిని, అగ్నిని, కాలభైరవుడిని పూజిస్తారు. అఘోరీలు అన్ని రకాల మాంసాలను తింటారు. కానీ గొడ్డు మాంసం మాత్రం తినరు. అఘోరీలు అవసరం అనుకున్నప్పుడల్లా జనాల్లోకి వస్తుంటారు. ప్రజల సమస్యలు తంత్ర ప్రక్రియల ద్వారా తీరుస్తుంటారు.ఇద్దరిలో ఉన్న కామన్‌ పాయింట్‌ ఒక్కటే. అఘోరీలు కానీ నాగసాధువులు కానీ గురువు అనుమతి లేకుండా ఏమీ చేయరు. వీళ్లు ఏం చేసినా గురువు పర్యవేక్షణలోనే చేస్తుంటారు. అయితే ఇప్పటికీ కుంభమేళాలో మొదటి స్నానం నాగసాధువులు చేస్తారట. ఆ తర్వాత అఘోరీలు ఈ తర్వాతే మిగతా వాళ్లు నది స్నానం చేయాలని నియమం ఉందట.

Previous Post Next Post

نموذج الاتصال