తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ నమూనాను నేడు విడుదల చేశారు. సాధారణ మహిళను పోలినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఇరవై అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. కాళ్లకు పట్టీలు, మెట్టెలు, పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర, మెడలో కంటి, చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి.
Tags
News@jcl
