*
*ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము*
*సర్పంచుల సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్*
తెలంగాణ రాష్ట్రంలో 2019 - 2024 కాలవ్యవధిలో సర్పంచులుగా కొనసాగి రాష్ట్రవ్యాప్తంగా బిల్లులు అందని సర్పంచులు నేడు ఛలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిచ్చి మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ మరియు ఇతర సర్పంచులను జడ్చర్లలో ఉదయం 6 గంటలకు సమయంలో అక్రమంగా అరెస్టు చేసి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది,.
రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తున్నది అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం TS ను TG గా మార్చడానికి 2700 కోట్లు ఖర్చు చేయడం జరిగింది కానీ కేవలం 1300 కోట్లు ఉన్న సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమైన చర్య,గ్రామపంచాయతీలలో వీధిలైట్ల నిర్వహణ, అంతర్గత మురుగు కాలువల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, మనఊరు - మనబడి, పల్లెప్రగతి, గ్రామపంచాయతీల భవన నిర్మాణాలు,మిషన్ భగీరథ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ప్రజలతో చేపట్టి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడంలో మా వంతు కృషి చేయడం జరిగిందని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టి ప్రజలతో, గ్రామపంచాయతీ సిబ్బందితో మమేకమై గ్రామాలను ఆరోగ్యవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు సరైన సమయంలో అందకపోయినా సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే క్రమంలో సొంత డబ్బులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వలన సరైన సమయంలో బిల్లులు రాక సర్పంచులు అప్పుల పాలయ్యారని అన్నారు.. ఈ క్రమంలో ప్రభుత్వం నుండి మేము అధికారంలో ఉన్నప్పుడు గాని, మా పాలకమండలి గడువు ముగిసి పది నెలలు కావోస్తున్నాగాని ఇప్పటికీ మా యొక్క పెండింగ్ బిల్లులు అందగా 12,769 గ్రామపంచాయతీల సర్పంచుల యొక్క బాధలు వర్ణనాతీతం.పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందక గ్రామాలలో అస్తవ్యస్తమౌతున్న పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను చూసి మా మనసులు చలించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం అనే పేరుతో ప్రతిష్టాత్మకంగా నాటిన మొక్కలకు నీరు పోసే నాధుడు లేక మొక్కలు విలవిలలాడుతున్నాయి. గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేసి ఖర్చుపెట్టిన సర్పంచులు బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇట్టి విషయమై అధికారులకు,ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఫలితం శూన్యం. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామపంచాయతీలను అభివృద్ధి పరచడంలో భాగస్వామ్యులమైన మా సర్పంచుల ప్రధాన డిమాండ్లు తెలిపారు.
◆ గ్రామపంచాయతీలలో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు మొత్తం వెంటనే చెల్లించాలి.
◆ బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకుని మరియు విధి నిర్వహణలో మరణించిన సర్పంచ్ కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆయా కుటుంబాలను ఆదుకోవాలి.
◆ గ్రామాలలో ప్రస్తుతం సర్పంచులు లేనందున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కమిటీలలో మాజీ సర్పంచులకు స్థానం కల్పించాలి.
◆గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు సర్పంచులు చేసిన అప్పులు తీర్చలేక వ్యక్తిగత ఆస్తులు అమ్ముకొని అవస్థలు పడుతున్న మాజీ సర్పంచులను వారి కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
డిసెంబర్ 2024 నెల చివరి వరకు బిల్లులు చెల్లించకపోతే డిసెంబర్ నెలలో నిరాహార దీక్షకు సైతం వెనకాడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు వల్లూరు శ్రీనివాసులు, ప్రభాకర్ రెడ్డి, మండల కోశాధికారి నర్సింలు,మాజీ సర్పంచులు పాల్గొన్నారు.