Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..


 

హైదరాబాద్ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. పలు పబ్బులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు.

హైదరాబాద్: నగరంలోని పబ్బులు గబ్బు రేపుతున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా చెలరేగిపోతున్నాయి. ఒకవైపు వరసగా డ్రగ్స్‌తో పట్టుపడుతుండగా మరోవైపు యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. వినోదం ముసుగులో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా విచక్షణ మరుస్తున్నారు. నగర పోలీసులు డ్రగ్స్, రేవ్ పార్టీలు వంటి వాటిపై సీరియస్ దృష్టి సారించి ఇప్పటికే విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, బడా పారిశ్రామిక వేత్తలను పలు పబ్బుల్లో అరెస్టు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది పబ్బుల నిర్వహకుల తీరు మాత్రం మారడం లేదు. డబ్బు సంపాదించేందుకు దేనికైనా సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలు అరికట్టేందుకు నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

జాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. పలు పబ్బులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు. టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌‌లో ఏకంగా 140మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్బు నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు చెందిన 40యువతులను తీసుకువచ్చి యువకులను ఆకర్షించేందుకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow