చాలామంది మిత్రులు పిండి దేనితో తయారు అనే దాని గురించి చాలా చెప్పేశారు కానీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందము, రుచితప్పితే మనిషి జీవితానికి ఎలాగు పనికిరాని పిండి అని చెప్పాలి మైదా. ఇంట్లో చేసుకుని తినటం ఆపేసి బయట తినటం మొదలుపెట్టిన తర్వాత ఈ మైదా వాడకం కొన్ని వేల రేట్లు పెరిగింది. అందుకే సమాజంలో ఇన్ని వ్యాధులు. ఈ మైదాకు తోడు మరో ప్రమాదకరమైన పదార్థం డాల్డా ఈ రెండు కలిసి రుచుల ప్రపంచాన్ని రాజ్యమేలుతున్నాయి. ఈ రెండు కలిసి సమాజంలో పాడు చేసిన వంటకాల పేర్లు కొన్ని చెబుతాను. 1.జిలేబి ఒకప్పుడు అర్చక మినప పిండి రుబ్బి కొద్దిగా బియ్యప్పి పిండి కలిపి మాత్రమే తయారు చేసేవరు. అందుకే అప్పట్లో జిలేబి రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకొని మరి తినేవారు. పైగా కొన్ని వ్యాధులలో ఔషధంగా కూడా తినేవారు దానిని. ఇప్పుడు మైదా వచ్చిన తర్వాత అతి సులువుగా ప్రతి బజారులో అమ్ముతున్నారు సాంప్రదాయమైన వంటామే కదా ఏమీ చేయదని తింటున్నారు అందుకే వ్యాధులు పెరిగాయి. 2. గవ్వలు కాజాలు ఇవి కూడా స్వచ్ఛమైన మొరపెట్టిన గోధుమపిండి కొద్దిగా బియ్యపు పిండి కలిపి ఇంట్లో తయారు చేసుకునేవాళ్ల బెల్లం పాకం పట్టేవారు అందులో యాలకుపొడి వేసుకొని కమ్మగా తినేవాళ్లు. ఇప్పుడు మైదాపిండి బియ్యపు పిండి అది కూడా పాలిష్ పెట్టిన బియ్యపు పిండి కలిపి రంగు వేసిన బెల్లం కొద్దిగా పంచదార (కంటికి నింపుగా ఉండటం కొరకు) కలిపిన పాకంలో మిఠాయి రంగు వేసి మరీ చేస్తున్నారు. ఆ మిఠాయి రాములు లెడ్ క్రోమైడ్ అని ఒక విషరసాయనం కలుపుతారు. 3. కజ్జికాయలు 4. వెన్నుండలు.5. జంతికలు. 6. చేగోడీలు. ఆఖరికి రోజు హోటల్లో టిఫిన్ గా పెట్టి 7.పరాటా 8. రవ్వట్టు 9. దోస. 10. పూరి ఇవన్నీ కూడా రుచిగా రావటం కొరకు మైదా పిండిని, బోలుగా క్రిస్పీగా ఉండటం కోసం బాగా వేడి వేడి డాల్డా నీ పిండిలో కలిపి తయారుచేస్తున్నారు. మగవాడివి ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అడగకండి. నా భార్య 2015 నుంచి అనారోగ్యంతో ఇంట్లో పనులు చేయలేని పరిస్థితిలో పిల్లలు దూరంగా వారి వారి బాధ్యతలలో ఉన్నందున డాక్టర్ గారి సూచన మేరకు 2015 నుండి కొన్ని పనులు, 2018 నుంచి 2021 తను చనిపోయేంతవరకు సమస్త ఇంటి పనులు ఆమెకు వండి పెట్టే పనిని నేనే చేశాను కనుక ఇవన్నీ నా భార్య ద్వారా తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడటం కొరకు ఆమె అడిగిన పిండి వంటలన్నీ నేనే ఇంట్లో చేయటం వలన తెలిసినవి. ఆమె కూడా ఎన్నో సందర్భాలలో మైదాపిండితో చేసే వంటలని అడిగేది. అదేమంటే బయట దాంతో చేయపట్టే అంత రుచిగా వస్తున్నాయి. కనుక తీసుకురండి అనేది నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది లేకుండానే చేసి పెడతాను అని చేసే వాడిని. అసలే పేషెంట్వి, ఇన్నాళ్లు 32 సం. నీవు చేసి పెట్టావు కదా ఇక్కడినుంచి నా ఓపిక ఉన్నంతవరకు నేనే చేసి పెడతానని బయట తిండి 99% తగలకుండా నేనే చేసే పెట్టాను. ఆ అనుభవం వలన ఇప్పుడు నేను ఒంటరిగా కూడా బ్రతకగలుగుతున్నాను పిల్లల పైన ఆధారపడకుండా. దయచేసి మీరు కూడా ఇంట్లోనే చేసుకు తినండి వీలైనంత వరకు. బయటకు వెలవలసి వస్తే ఇడ్లీ లాంటివి తప్పితే తినకండి. లేదంటే నెలకు ఒకసారి అకేషనల్ గా ఆ ఋచులను ఆస్వాదించండి. ఆరోగ్యంగా ఉండండి. దయచేసి అనారోగ్యం పాలు కాకండి నా మాట వినండి.
Tags
Newsatjcl