ఆర్టీసీ బస్సులో బ్యాగు చోరీ

- రూ.2.80లక్షల విలువైన బంగారు వస్తువులు అపహరణ

 

జడ్చర్ల న్యూబస్టాండులో ఆగి ఉన్న బస్సులో నుంచి ప్రయా ణికుల బ్యాగులు చోరీ అయ్యాయి. జడ్చర్ల సీఐ ఆది రెడ్డి తెలిపిన వివరాల మేరకు... జనగాం జిల్లా సంజ య్‌నగర్‌కు చెందిన భార్య,భర్తలు ఆంజనేయులు, ఉపేంద్రలు సోమవారం కర్నూల్‌ నుంచి హైదరాబా ద్‌కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. మద్యాహ్నం ఒంటిగంటప్రాంతంలో జడ్చర్ల కొత్తబస్టాండులో భోజ నం కోసం ఆర్టీసీ బస్సు ఆగింది. ఇదే సందర్భంలో భార్య,భర్తలు ఇద్దరు వెంట తెచ్చుకున్న బ్యాగులను బస్సులో ఉంచి బస్టాండులో తినుబండారాలు తీసు కుని బస్సులోకి వచ్చారు. కాగా బస్సులో ఉంచిన రెండు బ్యాగులు చోరీకి గురయినట్లుగా గుర్తించారు. బ్యాగులో రెండుతులాల బంగారు నెక్లెస్‌, రాళ్ల బిళ్లతో కూడిన రెండు తులాల నాను, రెండు తులాల న ల్లపూసల దండ, 9రాళ్లతో ఉన్న ఏడు గ్రాముల బంగారు ఉంగరం, రెండు తులాల పుస్తెలతాడులు చోరీ అయ్యాయని, వీటి విలువ రూ.2.80లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు కాసం ఉపేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me