బెటాలియన్‌ ఎదుట ధర్నా



బెటాలియన్‌ పోలీసుల సెలవుల విధానాన్ని మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్‌ ఎదుట గురువారం పోలీసుల కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

బెటాలియన్‌ పోలీసుల సెలవుల విధానాన్ని మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్‌ ఎదుట గురువారం పోలీసుల కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలోనే అదే తరహా వ్యవస్థను అమలు చేయాలన్నారు.

కొత్తగా అమలులోకి వచ్చే రికార్డు పద్ధతిని ఉపసంహరించుకోవాలని, పనిభారాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరారు. బెటాలియన్‌లో కూడా 5 ఏండ్ల వరకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వాలని కోరారు. బెటలియన్‌ పోలీసుల కుటుంబీకులు పాల్గొన్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow