పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం

 పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం



కాలకృత్యాలు తీర్చుకునేందుకు రాత్రి వేళ బయటకు వచ్చిన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.


దేవరకద్ర, సెప్టెంబరు 22: కాలకృత్యాలు తీర్చుకునేందుకు రాత్రి వేళ బయటకు వచ్చిన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవరకద్ర మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదిహేనేళ్ళ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ ఆటోలో మాటు వేసి ఉన్న అదే గ్రామానికి చెందిన యువకుడు.. ఆమె నోటికి చున్నీ చుట్టీ ఆటోలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు జరిగిన ఘాతుకాన్ని చెప్పింది. బాలిక కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.t

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow