_మూడు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్
జిల్లాలోని 458 గ్రామాలకు, మూడు మున్సిపాలిటీలకు
ఈనెల19వ తేదీ ఉదయం 8:00 గంటల నుండి 21వ తేదీ ఉదయం 8:00గంటల వరకు మొత్తం 48 గంటలు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని మిషన్ భగీరథ గ్రిడ్ మహబూబ్ నగర్ డివిజన్ కార్యనిర్వాహక అభియంత పుట్టా వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.పాలమూరు రంగారెడ్డి కెనాల్ తీయటం కొరకు తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ వద్దగల నాగసాల నీటి శుద్ధి కేంద్రానికి వచ్చే పైపులైన్ అడ్డంగా ఉన్నదున్న అట్టి పైపులైన్ బ్రిడ్జి మీదికి మార్చడం కొరకు నీటి సరపరా నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆ పని పూర్తి కావడానికి సుమారు 48 గంటలు పడుతుందని అందువల్ల ఆ సమయంలో నీటి
సరపరా ఆపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దానివల్ల నాగసాల నుండి నీటి సరపరా అయ్యే జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ ఆసెంబ్లీ నియోజక వర్గాలలోని మొత్తం 458 గ్రామాలతో పాటు భూత్పూర్ మున్సిపాలిటీలో
పూర్తిగా, జడ్చర్ల, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలలో పాక్షికంగా నీటి సరపరా ఉండదని ఆయన వెల్లడించారు.
ఈ విషయంలో ప్రజలందరూ తమకు సహకరించాలని వెంకట్ రెడ్డి కోరారు.ఈ పనిని పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ శాఖ, మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ సమన్వయంతో చేయడం జరుగుతుందిని ఆయన తెలిపారు.
