జయహో గురు బ్రహ్మ

 

జిల్లా స్థాయి ఉత్తమ రాజస్వ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన రాజస్వ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ *సుధాకర్  ZPHS అయ్యవారిపల్లి

బి.సత్యనారాయణ రెడ్డి ఎస్ ఏ 
జెడ్పిహెచ్ఎస్ న సురుల్లాబాద్ గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 



-----------------------------------

అక్షరమే ఆయన ఆయుధం 

విద్యార్థులే ఆయన సర్వస్వం

అభ్యాసమే ఆయన లక్ష్యం

విద్యార్థులే ఆయన లోకం

విద్యాలయమే ఆయన గృహం 

అందరికీ మార్గ నిర్దేశకుడు ఆయనే,,,


విద్యను బోధించడమే  ధ్యేయంగా 

అజ్ఞానపు చీకటిని తొలగించుటకు 

విజ్ఞాన దివిటీలను వెలిగిస్తూ

ధనిక,బీద బేధం భావం లేకుండా అందరిని ఒకటి చేసింది ఆయనే,,,


నిత్యం చైతన్యాన్ని కలిగిస్తూ   

విద్యార్థుల భవిష్యత్తుకు

బంగారు బాటలు వేస్తూ

అక్షర జ్యోతులను వెలిగిస్తున్న సర్వోన్నతుడు ఆయనే,,,


మాతృదేవోభవ,

పితృదేవోభవ అని

తల్లి,తండ్రుల తరువాత

గురువే దైవంతో సమానం అని పురాణాలు చెబుతున్నాయి     

ప్రేమతో,క్షమతో,సహనంతో

మంచి దారి చూపే సమాజ నిర్మాత,,, 


విద్యార్థులను ఉత్తమ

పౌరులుగా తీర్చిదిద్ది 

విజ్ఞులుగా ఈ జగతికి

అందించిన పరబ్రహ్మ

అనుక్షణం దేశ కోసం

శ్రమిస్తున్నది గురువే కదా,,,

✍🏻 వి.జానకి రాములు గౌడ్

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow