చికెన్, మటన్, చేపల వ్యర్ధాల కుంభకోణం ..? చికెన్ వ్యర్ధాల విలువ 70 లక్షలు





చికెన్ వ్యర్థాల తరలింపులో ఊహించని పరిణామం , పెద్దల మోసం తెలిసి వచ్చింది-జడ్చర్ల మున్సిపల్ కు ఆదాయం కలిసొచ్చింది, ఒక్క సంవత్సరానికిగాను  రూ..70 లక్షల50వేలకు వేలంపాటలో దక్కించుకున్న గద్వాల వాసి ఇన్నాళ్లు తమ అనుచరులకు రూ..75 వేలకే ఇప్పించి ఎంత నొక్కేశారో, చక్రం తిప్పిన పెద్దల మోసం పల్లవి కథనంతో పదిమందికి తెలుసొచ్చింది   మహబూబ్నగర్/జడ్చర్ల


చికెన్, మటన్, చేపల వ్యర్ధాల కుంభకోణం జడ్చర్లలో ఈరోజు జరిగిన చికెన్, మటన్, చేపల వ్యర్ధాల వేలంపాటలో 70,50,000/-  గద్వాలకు జిల్లాకు చెందిన నరసింహ అనే వ్యక్తి వేలం పాటలో దక్కించుకోవడం జరిగింది, అంటే గత పది సంవత్సరాలలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పందుల కుంభకోణంతోపాటు, చికెన్, మటన్,చేపల వ్యర్ధాల కుంభకోణం జరిగింది. సంవత్సరానికి 70 లక్షల చొప్పున 10 సంవత్సరాలకు గాను ఏడు కోట్ల రూపాయలు ఎవరికి చేరినాయో చెప్పాలని అప్పటి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపి నేతలు,  టిఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపి పార్టీల కౌన్సిలర్లు,జడ్చర్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఆమె భర్త దోరపల్లి రవీందర్ సమాధానం చెప్పాలని ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఉన్న నాయకుల మాదిరిగానే కాని ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ కూడా  ముందు  సిఫారసు లేక ఎలా ఇచ్చారని, స్థానిక టిఆర్ఎస్ బిజెపి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో పెద్దల మాయ గతంలో 75 వేలకే కట్టబెట్టిన టెండర్ ఇప్పుడు 70,లక్షలతేడాభారీ తేడా ఉందని, దీన్ని బట్టి చూస్తే అవినీతికి మున్సిపల్ లో ఇంకా ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో ఇంకా ఎంత నొక్కుతున్నారో అని జడ్చర్ల జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఏది ఏమైతేనేం మార్పు మొదలైంది అవినీతి ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో ఇంకెన్ని వింతలు చూడాలో  రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి మరింత ఆదాయం సమకూరుస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. గత ఛైర్పర్సన్ ఇటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్లే వారిపై అవిశ్వాసం ప్రకటించి చికెన్ సెంటర్ వెల్ఫేర్ యూనియన్ కి కౌన్సిలర్లు అంతా పూర్తి మద్దతు ప్రకటించారు. పల్లవి కథనం ప్రచురించడంతో కౌన్సిలర్లు కూడా ఆమోదం తెలిపి గత టెండర్ రద్దు చేయించి ఓపెన్ టెండర్ కి జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సొంటి రాజయ్య పిలుపునిచ్చారు. 


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow