*బైక్ ను ఢీకొన లారీ తల్లి కూతురి దుర్మరణం*
*-బోనాల పండుగకు వెళ్లి వస్తుండగా జడ్చర్ల మండలం గోప్లాపూర్ వద్ద ఘటన*
*-ఆగ్రహించిన బంధువులు రోడ్డుపై ధర్నా*
JCLNEWSTV, జడ్చర్ల :
తల్లి గారి ఊరికి వెళ్లి రాఖీ పౌర్ణమి బోనాల పండుగ ముగించుకుని తన స్వగ్రామమైన లింగంపేట్ కు బయలుదేరగా రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు దుర్మరణం చెందిన ఘటన గురువారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి జడ్చర్ల మండలం లింగంపేట గ్రామానికి చెందిన రేఖ 23 తన కూతురు సాత్విక 4 తో కలిసి తన తల్లి గారి ఉరు అయిన నాగర్ కర్నూలు జిల్లా ఎదిరేపల్లికి రాఖీ పౌర్ణమి సందర్భంగా వెళ్లారు రాఖీ పౌర్ణమి ముగిశాక మృతురాలి చెల్లి బోనాల పండుగ ముగించుకొని వెళ్లాల్సిందిగా కోరింది దీంతో బోనాల పండుగ ముగిశాక మృతురాలి భర్త అయినా చెన్నకేశవులు లింగంపేట గ్రామంలో బోనాల పండుగ ఉంది త్వరగా రావాలని తన భార్యను కోరాడు దీంతో తన చెల్లెలు భర్త ఆయన ఆంజనేయులుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎదిరేపల్లి నుండి లింగంపేట గ్రామానికి బయలుదేరింది ఈ క్రమంలో గంగాపూర్, కోడుగల్ రహదారిలో ఫర్టిలైజర్ లోడ్ తో వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే కార్యక్రమంలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి తల్లీకూతురు రోడ్డుపై పడగా ద్విచక్రవాహం పక్కకు వెళ్ళింది దీంతో రోడ్డుపై పడ్డ తల్లి కూతురు పై నుండి లారీ వెళ్లడంతో వారి తలభాగాలు చిత్రమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆంజనేయులు ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాల నుండి బయటపడ్డాడు ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘటన స్థలం వద్దకు చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు కుటుంబ సభ్యులు గంగాపూర్ కోడగలు వెళ్లే రహదారిపై ముళ్ల కంపల్ వేసి రహదారిని పూర్తిగా మూసేసి రాకపోకలను అడ్డుకున్నారు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని రహదారి వెడల్పు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని వారు ఆరోపించారు విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి తాసిల్దార్ సత్యనారాయణ ఎంపీడీవో ఆనంద్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు కాగా సుమారు మూడు గంటల నుండి గంగాపూర్ కోడుగల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కాగా సంతోషంగా భార్య పిల్లలతో కలిసి బోనాల పండుగ చేసుకుందామని ఇంటికి రమ్మన్నానని ఇంతలోనే రోడ్డు ప్రమాదం తన భార్య కూతుర్ని కబళించిందని ఇక తన ఎవరితో కలిసి పండగ జరుపుకోవాలని తనకు దిక్కె ఎవరని భర్త చెన్నకేశవులు రోజున అందర్నీ కదిలించింది.
