ఆ స్కూలుకు రోడేది...
జంగల్ లో ఉందేమో అందుకే రోడ్ వేయలేదు అనుకుంటా..
కాదు కాదు అది అభివృద్ధికి నోచుకోని ఏ పల్లెటూరు అయ్యుంటుంది...
అట్లా కూడా కాదు అంటే అక్కడ జనాలు ఎవరు ఉండరేమో అందుకోసం రోడ్డు ఏ లేదేమో...
పల్లెటూరు కు గ్రామము.. అనుకుంటే మీరు బురదలో కాలేసినట్టే..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కేంద్రీయ విద్యాలయానికి పోయే రహదారి గురించే నేను ఇప్పుడు చెప్పబోయేది.
ఇంతకుముందు కేంద్రీయ విద్యాలయం మెయిన్ రోడ్డు మీద ఉండేది..
పదేళ్ల కిందట ఇక్కడి నుండి చైతన్య సెంట్రల్ స్కూల్ రైల్వే లైన్ అవతలికి మార్చారు
.
ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా..
ఆ కేంద్రీయ విద్యాలయానికి హంగు ఆర్భాటాలతో పాటు పెద్ద రోడ్డు ఉంటది కదా నువ్వేంది ఏది ఏదో రాస్తున్నావ్ అనుకునేరు.
పేరుకు కేంద్రీయ విద్యాలయమే కచ్చ రోడ్డు కూడా లేదు..
ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉన్నప్పుడు కనీసం 30 ఫీట్లు 40 ఫీట్ లో రోడ్ ఉంటది కానీ మా పాలమూరులో కేంద్రీయ విద్యాలయానికి పట్టుమని పది ఫీట్ల రోడే గతి.
గతవారం పది రోజులుగా దబిడి దిబిడిగా వానలు పడుతున్నాయి కదా.
ఇంకా రోడ్ల పోవాలి అంటే పిల్లలకు తీరక కష్టం వచ్చింది..
కేంద్రీయ విద్యాలయం పొద్దుగాల 8:30కే మొదలైతది మధ్యాహ్నం రెండున్నర కొందరికి మూడున్నర కొందరికి కిలాసులైపోతాయి.
సుమారు 1100 మంది పిల్లలు చదువుకొని పోతారు.
మీ మీకేం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా శీను మొత్తం త్రిడిలో కనబడ్డది.
ఉన్నది 10 ఫీట్ల రోడ్డు అది కూడకా వెంచర్లు ఎప్పుడో వదిలిన సన్న రోడ్డు ఎర్రమట్టి రోడ్డు వాహనకు మొత్తం గుంతలు మెట్టలు అయిపోయింది.
ఈ సమస్య మీద పది ఏళ్ల కొలిగా అందరూ ఆఫీసర్లు కలిసి రండి పిల్లల తల్లిదండ్రులు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కలిసిండ్రు ఎమ్మెల్యేని కలిసిండ్రు కలెక్టర్ ఉన్న పార్లమెంటు సభ్యురాలు కూడా కలిసిం
