మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆల్వాల్ పల్లి గ్రామ శివారులో గల గొల్లత గుడి దగ్గర బర్రెను తప్పించడానికి పోయి బోల్తాపడ్డ కారు.
జడ్చర్ల నుండి కల్వకుర్తి సైడ్ వెళ్తావున్న ఎక్కువైపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు సాయంకాలం తన పనులు ముగించుకొని కల్వకుర్తి రూట్ లో వెళ్తుండగా గంగాపూర్ దాటి తర్వాత ఆల్వాల్ పల్లి మధ్యలో ఉన్న గొల్లత గుడి దగ్గరికి రాగానే అనుకోకుండా బర్రెలు రోడ్డు మీదకు వచ్చాయి వాటిని తప్పించడానికి ప్రయత్నం చేసి కార్ కట్ చేయగా బోల్తా పడి పంట పొలాల్లో పడిపోయింది.
కొద్దిపాటి గాయాలతో కార్ల నుంచి బయటికి వచ్చిన ఎక్కువైపల్లి శ్రీనివాస్ రెడ్డి. ప్రమాదకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వెంటనే స్పందించిన గ్రామ యువకులు జెసిబి తీసుకొని వచ్చి బోల్తాబడ్డ కార్ని పైకి లేపారు.