Tg నేను బతికే ఉన్న.పింఛన్‌ ఇవ్వండి సారూ

 TG



నేను బ్రతికున్న సచ్చిపోయాయని అంటున్నాది ఈ సర్కార్ ప్రజావాణిలో వృద్ధురాలు అవేదన 


అందుకే పింఛన్‌ ఇస్తలేదు

కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇచ్చిండు

నాకు పింఛన్‌ ఇచ్చేందుకూ వీళ్లకు చేతులొస్తలేవు!

ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన


 నేను బతికే ఉన్న.పింఛన్‌ ఇవ్వండి సారూ' అంటూ ఓ వృద్ధురాలు ఎక్కని మెట్లు, కలవని అధికారి లేడు. అధికారులు కనికరించకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకునేందుకు వచ్చింది. ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే రుక్నమ్మకు 59 ఏండ్లు. భర్త చనిపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది.



పింఛన్‌ మంజూరు కోసం తహసీల్దార్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నది. కేసీఆర్‌ ప్రభుత్వంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరైందని, ఇప్పుడు మాత్రం పింఛనూ ఇస్తలేరని ఆవేదన వ్యక్తంచేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow