భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి.. శుభలేఖలు పంచిపెట్టిన ఇద్దరు భార్యలు

 


అందరితో కలిసిపోయి.. అణుకువగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుని… భార్యాబిడ్డలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చాలామంది అబ్బాయిలు కోరకుంటారు. తమను అర్థం చేసుకునే అమ్మాయి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు. కానీ కొందరు రిస్కీ ఫెల్లోస్ ఒకరికి తెలియకుండా.. మరొకర్ని పెళ్లి చేసుకుని ఇద్దర్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాకపోతే.. ఎప్పుడైనా విషయం బయటపడితే ఆ భర్త కొంప కొల్లేరే..!



ఒక భార్యనే మోయడం కష్టం అనుకుంటున్నారు ఇప్పటి జనరేషన్‌లో కొందరు కుర్రాళ్లు.. కానీ అల్లూరి జిల్లాలో అయితే ఇద్దరు భార్యలతో ఎంచక్కా సంసారం సాగించే ఓ భర్త.. ఇప్పుడు ముచ్చటగా మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అఫీషియల్‌గానే.. అందుకు అప్పటికే ఉన్న ఇద్దరు భార్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేనా.. వారిద్దరూ పెళ్లి పెద్దల్లా మారి అన్ని తామై చూసుకున్నారు. హ్యాపీగా బంధుమిత్రులను ఆహ్వానించారు. మా భర్తకు మూడో పెళ్లికి అందరూ వచ్చి ఆశీర్వదించాలని శుభలేఖలు కూడా పంచారు. మీ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ ప్రతి ఒక్కరి గడపకు వెళ్లి… పెళ్లి కార్డు ఇచ్చి మరి ఆహ్వానం పలికారు. ఇంతకీ ఇద్దరి భార్యల సమ్మతితో మూడో భార్యను సొంతం చేసుకున్న ఆ లక్కీయస్ట్ ఫెలో ఎవరో తెలుసుకోవాలని మీకు ఉందా.. పదండి డీటేల్స్‌లోకి వెళ్తాం.


అది అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న.. పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు. అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుం..డా ఆ ఇద్దరు భార్యలు భర్తను చక్కగా చూసుకుంటున్నారు. అయితే.. అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న పండన్న.. లక్ష్మీ అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెది జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామం. లక్ష్మీని ఇష్టపడ్డ విషయం .. తనను ఎంతగా ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు.



ఆ ఇద్దరు భార్యలే స్వయంగా..


దీంతో ఇక పండన్న వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకొని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే.. ఆ ఇద్దరు భార్యలతో రాయభారం పంపాడు. పెద్దలు కూడా అంగీకరించడంతో.. లక్ష్మీని పండన్నకు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow