Rythu Bharosa: ఐదెకరాలా..? పదెకరాలా..? రైతు భరోసా ఇక వాళ్లకే..! మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ..
ఐదెకరాలకు ఇవ్వాలా? పది ఎకరాల వరకు ఇవ్వాలా?. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న క్వశ్చన్. ఈ ప్రశ్నకు ఆన్షర్ తెలుసుకోవడానికి రైతుల దగ్గరకే వెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వమంటారో మీరే చెప్పండి అంటూ అభిప్రాయ సేకరణ చేయబోతోంది మంత్రివర్గ ఉపసంఘం. రైతు భరోసా లిమిట్‌పై..
ఈ సందర్భంగా రైతు భరోసా పథకంపై అభిప్రాయాలను, సలహాలను సేకరిస్తారు.. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి.. ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది..? అర్హులను ఇలా ఎంపిక చేయాలి… అనే వివరాలను రైతుల నుంచి సూచనలు సలహాలను మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో వివరాలు స్వీకరించి నివేదిక రూపొందించనున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ పథకానికి సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసి తదనంతరం రైతు భరోసా పథకం అమలుచేయనున్నారు.