గౌరవ వేతనం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం*

 *గౌరవ వేతనం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం* 



 *మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి* 


 *శాసనమండలిలో సమస్యలను ప్రభుత్వానికి నివేదించిన ఎమ్మెల్సీ* 


కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు గౌరవ వేతనాలు కూడా చెల్లించడంలేదని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం శాసనమండలిలో పలు సమస్యలను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఎకరవు పెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ వేతనాల చెల్లింపులు బంద్‌ అయ్యాయని ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సిన గౌరవవేతనాలు రూ.100 కోట్లకు పైనే ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సర్పంచ్‌లు, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ), మండల ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక సభ్యులు (జడ్పీటీసీ సభ్యులు) గౌరవ వేతనాలు చెల్లించడంలేదని, తమ పదవీ కాలం కూడా పూర్తయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు నెలకు రూ.13 వేల చొప్పున చెల్లిస్తున్నారని రాష్ట్రంలో ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు 539 మంది చొప్పున ఉన్నారు. ఎంపీటీసీలు 5,817 మంది, సర్పంచ్‌లు 12,769 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.6,500 చొప్పున ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభు త్వం వచ్చాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలకు నిధులు విడుదల చేయలేదని ఇటీవల పదవీకాలం ముగిసిన సందర్భంగా చేస్తున్న సన్మానాల కార్యక్రమంలో తమకు గౌరవ వేతనాలు ఇప్పించాలని కార్యక్రమానికి హాజరవుతున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను వేడుకుంటున్నారని వేదనాలు ఇవ్వాలని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందంటూ నవీన్ రెడ్డి ప్రభుత్వానికి చురకలు అంటించారు. అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు వ్యవహారంలో స్పందిస్తూ రానున్న నాలుగేళ్ల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పాడి రైతులకు సబ్సిడీ వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏ అందించాలని ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి సభలో పేర్కొన్నారు.. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow