బెంగళూరులోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్ నుంచి మటన్ పేరుతో బెంగళూరుకు కుక్క మాంసం సరఫరా అవుతోందని హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన రైలులో భారీగా కుక్క మాంసాన్ని పట్టుకున్నారు. 90 డబ్బాల్లో తరలించిన 4500 కిలోల కుక్క మాంసాన్ని హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. అయితే నిత్యం బెంగళూరు నగరానికి 14 వేల కిలోల కుక్క మాంసం వస్తున్నట్లు సంబంధిత వర్గాలు ఆరోపించాయి.
Dog Meat: ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్‌లో చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తింటున్నారు. ఇక మరికొంత మంది వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంట్లో పొయ్యి వెలిగించకుండా.. బయటికి వెళ్లి తింటూ ఉంటారు. అందులో చాలా మంది నాన్ వెజ్ ప్రియులే ఉంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన తీవ్రంగా భయపెడుతోంది. ఎందుకంటే మటన్ అని చెప్పి.. కుక్క మాంసాన్ని హోటళ్లకు సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం సంచలనంగా మారింది.
Dog Meat: గత కొన్ని రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు బయట పడుతుండటం సంచలనంగా మారింది. కుళ్లిన మాంసం, పాడైన మాంసం దొరికిన హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. తాజాగా రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన భారీగా కుక్క మాంసం.. పట్టుకోవడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. 90 బాక్సులలో 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భయంకరమైన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
