లిక్కర్ స్కాం కేసులో కవిత కొత్త వ్యూహం.. ఈ లాజిక్‌తో బెయిల్ ఇవ్వాల్సిందే..!?


 


రాజకీయ ప్రకపంనలు సృష్టిస్తోఢిల్లీన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో అరెస్టయి జ్యూడీషియల్ ఖైదీగా 120 రోజులుగా తీహార్ జైలుతో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరకటం చాలా కష్టంగా మారింది. ఏ న్యాయస్థానంలోనూ కవితకు బెయిల్ దొరకట్లేదు. దీంతో.. కవిత తరపు న్యాయవాదులు కొత్త వ్యూహాన్ని రచించారు. వాళ్ల లాజిక్ ప్రకారం.. కవితను ఈసారి కచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్ముతున్నారు.

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తీహార్ జైలులో జ్యూడీషియల్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో.. కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సుమారు 120 రోజులుగా ఖైదీగా ఉంటున్న కవితకు.. బెయిల్ దొరకటం కష్టతరంగా మారింది. అటు రౌస్ ఎవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించగా.. ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే.. ఈ కేసులో బెయిల్ పొందేందుకు కవిత.. మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.


బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతూ వస్తున్న నేపథ్యంలో.. డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ.. తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలేవి ఫలించకపోవటం గమనార్హం. న్యాయస్థానాలు ఆ బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో.. తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే... నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ తన దర్యాప్తును పూర్తిచేయలేకపోడంతో తమ కవితకు బెయిల్ ఇవ్వాలంటూ.. ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال