రేవంత్ రెడ్డి సంచలన సవాల్..!!

 రేవంత్ రెడ్డి సంచలన సవాల్..!!




తెలంగాణ అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సంచలన సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల స్కీమ్ లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ నాయకులు విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల పథకంలో రూ.700 కోట్లను స్వాహా చేశారన్నారు. బతుకమ్మ చీరల విషయంలో దోపిడీ జరిగిందన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow