పాలమూరు కు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి
తెలంగాణ మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు.
మహబూబ్ నగర్ జిలాల్లో రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.
ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన
మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం
గండీడ్ లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన.
పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన.
ఉమ్మడి పాలమూరు జిల్లా కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరాలు కురిపించారు. మంగళవారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సమస్యలు మరియు జిల్లా ప్రాజెక్టుల పైన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పుష్ప గుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించి, మహిళా సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 3680 మహిళా సంఘాలకు 334 కోట్ల రూపాయల రుణాలను అందించారు. మహిళా సంఘాల వారు తయారు చేసిన పలు ఉత్పత్తులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులతో అభివృద్ధి, జిల్లా ప్రాజెక్టులు, జిల్లా సమస్యలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, ఎంపి మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సిపల్ చైర్మన్, మరియు అన్ని శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.