నవీన్ "పాలమూరు" ను జాగ్రత్తగా చూసుకో.. పాలమూరు భవిష్యత్ నాయకుడివి నీవే

నవీన్ "పాలమూరు" ను జాగ్రత్తగా చూసుకో.. 



 పాలమూరు భవిష్యత్ నాయకుడివి నీవే 


 బిఆర్ఎస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 


 మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు 


 నవీన్ పాలమూరును జాగ్రత్తగా చూసుకో.. ప్రస్తుతానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నువ్వు బీఆర్ఎస్ ఆశాకిరణం నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శనివారం గవర్నర్ ను కలిసే క్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గొడుగు తీసుకుని వర్షానికి అడ్డంగా కేటీఆర్ కోసం పట్టుకున్నారు. నవీన్ ను చూడగానే కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా ప్రతినిధిగా నీ ప్రస్థానం కొనసాగించాలని.. పాలమూరును జాగ్రత్తగా చూసుకోవాలని కార్యకర్తలకు అండగా నిలబడాలనీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.ఆర్.ఎస్ అధినేత ఈ మాట చెప్పగానే నవీన్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఏ బాధ్యతలు పెట్టిన తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కార్యకర్తలకు అండగా నిలబడతానంటూ సమాధానం ఇచ్చారు...


Uploading: 567020 of 567020 bytes uploaded.


సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేది: హరీశ్




భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగుకు సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. వాగుకు గండి పడటానికి గల కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదని చెప్పారు. ప్రజలు రక్షించాలని అధికారులకు ఫోన్‌ చేస్తే కనీస స్పందన లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి హెలికాప్టర్లు రాకుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow