ఆచార్య దేవోభవ ..ఏం సాధించావురా ఓ మనిషి?




 

ఆచార్య దేవోభవ 


---+++-+++-+-++++--------

అక్షరాలనే ఆయుధాలుగా 

నిత్యం అక్షర సేద్యం చేసే శ్రామికుడు

సాధారణమైన విద్యార్థులను అసాధారణమైన 

విద్యార్థులుగా మార్చే 

అక్షర శిక్షకుడు

విద్యాలయంలో పాఠాలను బోధిస్తూ వారి మస్తిష్కంలో అక్షర విత్తనాలు మొలకెత్తించే అక్షర సేవకుడు 

విజ్ఞానపు వెలుగులతో అజ్ఞానాన్ని తొలగిస్తూ 

అక్షరం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే అక్షర సాధకుడు

జ్ఞానమనే మంత్రంతో  విద్యార్థులను సంస్కరిస్తూ భావి భారత పౌరులుగా

తీర్చిదిద్దే అక్షర యోధుడు

క్రమశిక్షణతో ఎదుగుతున్న సమయంలో పెరుగుతున్న చెడును తొలగిస్తూ సంస్కారంతో సరిచేసి అక్షర కోవిదుడు

తన శిష్యులను ఉన్నత శిఖరాలకు చేర్చి సంబరపడే అక్షర కృషీవలుడు 

కారు చీకట్లను సైతం చేదిస్తూ సమాజానికి వెలుగు రేఖలు అందించే అక్షర వీరుడు

అమ్మలా ఆదరిస్తూ నన్నలా ధైర్యాన్ని కలిగిస్తూ అనుక్షణం విద్యార్థులకు తోడై నిలిచే అక్షర యోధుడు,,,

✍🏻 వి.జానకి రాములు గౌడ్

Janaki Ramlu r: ఓ మానవత్వమా

------------------------------------

ఓ మానవత్వమా 

ఎక్కడ నీ చిరునామా? 

ఇకనైనా మమ్మల్ని మేల్కొల్పవా! 

మతం మత్తులో మునిగిపోతున్నావా! 

కులమనే గజ్జితో రగిలిపోతున్నావా! 

దౌర్జన్యకాండతో రెచ్చిపోతున్నావా!

రాక్షసత్వంతో రగిలిపోతున్నావా! 

పశుతత్వాన్ని ప్రదర్శిస్తున్నావా! క్రూరత్వంతో ప్రవర్తిస్తున్నావా!  

రాక్షసక్రీడతో రంకెలేస్తున్నావా! 

రాబందుల్లా రగిలిపోతూ! 

పసి మొగ్గలను బలి తీసుకుంటున్నావా! 

మానవత్వాన్ని మరిచిన కసాయి వ్యక్తుల చేతుల్లో 

బలైపోతున్న జీవితాలెన్నో? 

ఒక్కసారైనా గుర్తించావా?

విన్నావా వాళ్ళ ఆర్తనాధాలు 

ఓ మానవత్వమా!

ఆరేళ్ల చిన్నారి నుండి

అరవై ఏళ్ల ముసలమ్మ వరకూ బలైపోతున్నారు

దివ్యాంగులు సైతం 

దీనమైన స్థితిలో ఉన్న 

వదలడం లేదు ఈ రాక్షసులు 

విచిత్రపు అలవాట్లతో 

వింత చేష్టలతో విర్రవీగుతూ 

అభం శుభం తెలియని అమాయక స్త్రీల మన ప్రాణాలను బలి తీసుకుంటున్నారు 

అహంకారపు జ్వాలలను వెదజల్లుతూ 

ఆడదంటే అబలని సభల కాదని అడ్డంకులు సృష్టిస్తూ అనాగరికులుగా ప్రవర్తిస్తున్నారు 

ఇకనైనా నిజం తెలుసుకోండి 

మాతృమూర్తిని మించిన దైవం లేదని ఎప్పుడు తెలుసుకుంటారో 

ఈ మూర్ఖులు

ఈ జన్మకు కారణం అమ్మే కదా  మానవత్వాన్ని బతికించండి

మనుషులుగా జీవించండి,,,

✍🏻 వి.జానకి రాములు గౌడ్

+

ఏం సాధించావురా ఓ మనిషి?

------------------------------------

నేను అనే గర్వంతో విర్రవీగుతూ ఎవరిని లెక్క చేయకుండా ఏమి

సాధించావు రా ఓ మనిషి?

స్వార్థపు ఆలోచనతో సంపాదనకై ఆరాటపడుతూ ఆస్తులు,అంతస్తులు పెంచుకుంటూ ఎగిసిపడుతున్నావు?


ఉన్న భూమిని గజం లెక్కన అమ్మి సొమ్ము చేసుకుంటూ ఎంతెత్తు ఎదిగావురా ఓ మనిషి ?

వెనుతిరిగి చూస్తే ఎందరో కష్టాలకు,కన్నీళ్లకు

కారకుడవు అయ్యావురా

ఓ మనిషి?


జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు మోసాలేనా?

అబద్ధపు అరుపులతో మేక వన్నె పులిలా మారి మనుషులను మోసం చేశావురా ఓ మనిషి?

అవసరానికి అంతా నువ్వే అంటూ ఆరాటపడుతావు అవసరం తీరితే నువ్వెంత నీ బతుకెంత అంటావు?


మంచితనాన్ని మరిచి నీ గమ్యం ఏమిటో మరిచిపోయావు?

మోసంతో మనుషులను మాయ చేస్తూ

మానవత్వాన్ని మంటగలిపి మనిషిగా నీవెప్పుడు గెలిచావురా?


మనస్సు నిండా ప్రేమతో

మనసారా నవ్వుకుని,

ఆనందంతో,ఆత్మీయంగా 

కుటుంబ సభ్యులతో సుఖంగా బతికి ఎన్నాళ్లయిందో మర్చిపోయావా ఓ మనిషి?


ఇంకా ఎన్నాళ్ళు,ఎన్నేళ్లు నటిస్తావు ఒక నటుడిగా ఇక చాలించు నీ అవినీతికి అంతం పలుకు బ్రతికున్నన్ని రోజులు హాయిగా, ఆనందంగా జీవించు 

ఓ మనిషి,,,

✍🏻 వి.జానకి రాములు గౌడ్

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow