KALWAKURTHY వికాస్ ఎక్సలెంట్ స్కూల్ దౌర్జన్యం! బోనఫైడ్ కోసం 5700 వసూలు

 ప్రైవేట్ స్కూల్ లో బిడ్డను చదివించే ముఖమేనా నీది



అంటూవిద్యార్థినితండ్రినిఅవమానించిన వికాస్ ఎక్సలెంట్ స్కూల్ యజమాన్యం

బోనఫైడ్ కోసం 5700 వసూలు చేసిన వికాస్ ఎక్సలెంట్ స్కూల్ దౌర్జన్యం



  కల్వకుర్తి పట్టణానికి చెందిన మ్యాకల అమరావతి-మల్లికార్జున కుమార్తె అనుష చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉండే బాలిక. గత 15  రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన విద్య వైద్యం నీటు ఫలితాలలో 720 మార్కులకు గాను 526 మార్కులు, అదేవిధంగా ఎంసెట్ లోను సైతం 2025 ర్యాంకు సాధించి తన సత్తా చాటింది. తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కు వెళ్లడానికి కావలసిన పేపర్స్ ను అన్ని సరిచేస్తున  తరుణంలో, కల్వకుర్తి పట్టణంలోని వికాస్ ఎక్సలెంట్ హై స్కూల్ లో గత 12 సంవత్సరాల క్రితం అనూష మూడు ,నాలుగు తరగతులు చదువుకుంది, కానీ అప్పట్లో తీసుకున్న  బోనఫైడ్స్ ఇంట్లో కనిపించకపోవడంతో తప్పని పరిస్థితిలో పాఠశాలకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా భావించిన పాఠశాల యజమాన్యం అనూష తల్లిదండ్రులపై గత 15 రోజుల క్రితం పాఠశాలకు బోనఫైడ్స్ నిమిత్తం వెళితే దురుసుగా ప్రవర్తించారు.చాతనైతేనే ప్రైవేటు పాఠశాలలో చదివించాలి, నిన్ను మా పాఠశాలకు రమ్మని ఎవరు పిలిచారుఅని అసభ్యకరంగా మాట్లాడి అప్పట్లో మా పాఠశాలలో 5700/-రూపాయల పాత బాకీ ఉందని ముక్కు పిండి వసూలు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆ పాఠశాల నిర్వాహకులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ అదనంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో, ప్రవేటు పాఠశాలను అడ్డం పెట్టుకొని అమాయకులైన పేద తల్లిదండ్రులను దొరికిన కాడికి దోచుకుంటున్నారు.నాలాంటి మరి ఎంతోమంది తల్లిదండ్రులకు అన్యాయం జరగకూడదు అంటే, ఇలాంటి పాఠశాలలపై ప్రభుత్వ గుర్తింపు రద్దుచేసి,అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు ఏపీ బీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటికొండ ప్రశాంత్ యాదవ్. అంకి వంశీ. నవీన్.చంటి.పట్టణవాసులు సైతం డిమాండ్ వ్యక్తంచేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow