చింత చెట్టును ఢీకొట్టిన వనపర్తి అనూస్ పాఠశాల బస్సు ..

మద్యం మత్తులో బస్సు డ్రైవర్... 

ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు 

పోలీసుల అదుపులో డ్రైవర్..





పాఠశాల యాజమాన్యం పై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం..




వనపర్తి జిల్లా కేంద్రంలోని అనూస్ పాఠశాల బస్సు శనివారం సాయంత్రం రాజీనాగరం శివారులోని  బాపని గేరి దగ్గర ఉన్న చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు మునిగిళ్ళ గ్రామనికి చెందిన బస్సుడ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడంతో అతివేగంగా వచ్చి మలుపు దగ్గర ఉన్న చింత చెట్టును ఢీకొట్టడంతో  బస్సు పెద్ద ఎత్తున ధ్వంసం అయింది ప్రమాదం గురించి వనపర్తి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మధ్యమధ్యలో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు 



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow