నారాయణపేట జిల్లా పరిధి కోటకొండ గ్రామం దళితవాడలోని పలువురి ఇళ్లపై పోకిరీలు శనివారం కర్రలతో దాడులకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి.
కోటకొండలో పోకిరీల వీరంగం
కోటకొండ గ్రామంలో బీజేపీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ
- దళితవాడలో ఇళ్లపై దాడులు
- గ్రామంలో ఉద్రిక్తత
నారాయణపేట, జూన్ 22 : నారాయణపేట జిల్లా పరిధి కోటకొండ గ్రామం దళితవాడలోని పలువురి ఇళ్లపై పోకిరీలు శనివారం కర్రలతో దాడులకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. దాడులతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం గ్రామస్థుల్లో నెలకొంది. ఈమధ్యకాలంలో పలువురు పోకిరీ యువకుల మధ్య విబేధాలు తలెత్తడంతో అది కాస్తా కులాల వారీగా చీలి యువకుల మధ్య చిచ్చు రేపేందుకు కారణమైందని గ్రామస్థులు తెలిపారు. ఈనెల 21న ఏరువాక పండగ రోజు ఏరువాక తాడు తెంపే క్రమంలో బీసీ, మాల, దళిత యువకుల మధ్య ఘర్షణ జరిగి దళితవాడకు చెందిన పలువురు యువకులపై బీసీ, మాల యువకులు దాడి చేయడంతో పోలీసులను దళితులు ఆశ్రయించారు. శుక్రవారం రోజు జరిగిన సంఘటనతో ఆగ్రహంగా ఉన్న దళిత యువకులు శనివారం గ్రామంలో తిరుగుతుండగా తమపై దాడి చేసిన ఓ మాల యువకుడిని చితకబాదారు. ఈ విషయం కాస్తా గ్రామంలో దావనంలా వ్యాపించడంతో పలువురు బీసీ, మాల యువకులు రెచ్చిపోయి దళితుల ఇళ్లపై దాడులకు దిగారు. అలాగే పలువురు దళితులు బీజేపీ కార్యాలయంలో ఉండడంతో అక్కడా దాడిచేసి పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. హరిజన్ బాలప్ప, కిందింటి కృష్ణలు దాడిలో గాయపడ్డారు. పోకిరీ యువకుల మధ్య నెలకొన్న వివాదం జఠిలమై వర్గాల మధ్య కులచిచ్చుతో ఉద్రిక్తతకు దారి తీసింది. నారాయణపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హరిజన్ బాలప్ప ఫిర్యాదు చేశారు. దీంతో కోటకొండ గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కోటకొండలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. శనివారం గ్రా మంలోని పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచా యతీ కార్యాలయంలో పనిచేస్తున్న చంద్రప్పపై ఏరువాక సందర్భం గా తాగుబోతులు దాడి చేశారని దాంతో అతను పోలీసులకు ఫిర్యా దు చేయడంతో శనివారం మళ్లీ తాగుబోతులు చంద్రప్పపై దాడి చేయడమే కాకుండా దళితవాడలోని ఇళ్లను తిరిగి దాడులతో భయ భ్రాంతులకు గురి చేశారన్నారు. కొందరు దళితులు బీజేపీ కార్యాల యంలో తలదాచుకోగా దాడిచేసి గాయపర్చారని వారందరూ పోలీ సులకు ఫిర్యాదు చేశారన్నారు. ఘటనను ఎస్పీ, డీఎస్పీల దృష్టికి తీ సుకెళ్లామని, దోషులపై చర్యలు తీసుకుంటామని వారు చెప్పారని నా మాజీ తెలిపారు. కేంచే శ్రీనివాస్, సాయిబన్న, రాములు ఉన్నారు.