- కూతురి ప్రేమకు అడ్డస్తున్నాడని.. • భర్తను హత్య చేయించిన భార్య



- కూతురి ప్రేమకు అడ్డస్తున్నాడని..

• భర్తను హత్య చేయించిన భార్య

• మహబూబ్నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన

• మేకల కాపరి హత్య కేసును ఛేదించిన పోలీసులు



జడ్చర్ల: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో కూతురు ఫోన్లో మాట్లాడు తుండటాన్ని తప్పుబట్టడంతోపాటు వారి పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో భర్త ను భార్య హత్య చేయించిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం జడ్చర్ల కావేరమ్మపేట రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మెక్కం చిన్న ఆంజనేయులు (44) మేక ల కాపరి. ఆయన కుమార్తె అంజలికి హైదరాబాద్కు చెందిన పాండు ఇన్స్టాగ్రామ్లో పరిచయమ య్యాడు. అతనితో అంజలి తరచూ ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసి తండ్రి మందలించేవాడు. అయినా ఆమె ఖాతరు చేయకుండా పాండు తో ఫోన్లో మాట్లా డేది. ఈ క్రమంలో ఓరోజు కూతురిని తండ్రి తీవ్రంగా మందలించాడు. అడ్డు కోబోయిన భర్త భాగ్యలక్ష్మిని సైతం కొట్టాడు. ఆ తర్వాత కూతురి వద్ద తండ్రి చెడుగా ప్రవర్తించడంతోపాటు పాండుతో కూతురి పెళ్లికి నిరాకరించాడు. దీంతో భర్తను ఎలాగైనా అంతమొందించాలని భాగ్యలక్ష్మి పథకం రచించింది.

సుపారీగా మూడు మేకలు ఇస్తానని..: తన భర్తను హత్య చేయాలని.. మూడు మేకలను సుపారీగా ఇస్తానని తమ కాలనీలోనే ఉంటున్న కాళ్ల మైస మ్మను కోరింది. దీంతో మైసమ్మ పథకం ప్రకారం భాగ్యలక్ష్మి గత శుక్రవారం తన భర్తను మేకల షెడ్డు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి మైసమ్మకు అప్పగించింది. మైసమ్మ తన అనుచరులైన ముత్యాలమ్మ, నర్సింహులు సాయంతో ఆంజనే యులు గొంతు కోసి హతమార్చాడు. అనంతరం నిందితులంతా పరారయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సోమవారం భాగ్యలక్ష్మి, కాళ్ల మైసమ్మ, నర్సింహ, మాల ముత్యాలమ్మలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి న్యాయ స్థానం ఆదేశంతో రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి మోటారు సైకిల్, కత్తి, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow