రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ ఫర్నేస్ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ ఫర్నేస్ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు ఆయా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది ఉన్నట్లు సమాచారం.
షాద్నగర్ లోని పరిశ్రమలో భారీ పేలుడు ఆరుగురు మృతి షాద్నగర్ రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో విషాదం చోటుచేసుకుంది స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో కంప్రెసర్ పెరగడంతో ఆరుగురు మృతి చెందారు ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు చిత్రమయ్యాయి ఈ గతంలో 15 మందికి గాయాలు కాగా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి కంప్రెసర్ పేదలతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు దుర్ఘటన ఎలా జరిగిందని పై ఇంకా ఆరా తీస్తున్నారు. మృతులు ఒడిస్సా బీహార్ యూపీ వాసులుగా గుర్తించారు. కోసం ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది అవకాశం ఉన్నట్టు సమాచారం, గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడే కార్మికుల భద్రత అదృష్టం జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన సూచనలు మేరకు పాటించాలని అధికారులు ఇస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.