* బూర్గుల సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో ఘోర ప్రమాదం.!*


ముక్కలు ముక్కలుగా ఎగిరి పడ్డ శరీర భాగాలు..!








విడిపోయిన కార్మికుల  కాళ్లు చేతులు..!


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్‌ ఫర్నేస్‌ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు ఆయా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది ఉన్నట్లు సమాచారం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow