మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ
సౌత్ గ్లాస్ ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందన
శంషాబాద్ డిసిపితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న డీకే అరుణ
షాద్ నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పై మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ స్పందించారు. సౌత్ గ్లాస్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఐదు మంది కార్మికులు దుర్మరణం పాలైన సంఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలను పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. జరిగిన సంఘటనపై శంషాబాద్ డిసిపి రాజేష్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
సంఘటనకు సంబంధించిన విషయాలను ఆమె తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఫోన్లో మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన సంఘటన ఎంతో విషాదకరమని కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఐదు మంది చనిపోయారని మరి కొంతమంది గాయపడ్డారని అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారని పూర్తి సమాచారం అందాక బాధితులకు జరగాల్సిన న్యాయం పై అధికారులతో మాట్లాడతానని డీకే అరుణ స్పష్టం చేశారు. పరిశ్రమలో కార్మికుల భద్రత సౌకర్యాలు తదితర కార్మిక సంక్షేమం విషయాలు పరిశీలిస్తామని చెప్పారు. ఈ సంఘటనలో తప్పు ఎవరిదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమాయకులైన వలస కార్మికుల ప్రాణాలకు పరిశ్రమల్లో భద్రత కరువైందని డీకే అరుణ విచారం వ్యక్తం చేశారు. సంఘటనపై సమగ్ర జరపాలని స్థానిక అధికారులకు ఆమె ఆదేశించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు తగు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా పార్లమెంటు పరిధిలోని అనేక పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రమాణాలపై ఎంపీ డీకే అరుణ ఆరా తీస్తున్నారు. రాష్ట్రస్థాయిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? స్థానిక ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఈ సంఘటనపై ఏం విచారణ జరుపుతున్నారు? వాటి నివేదికలను తెప్పించుకుంటానని ఆమె స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమల్లో వలస కార్మికుల బ్రతుకులు చిధ్రం అవుతున్నాయని అనేక సంఘటనల ద్వారా మీడియా ద్వారా తెలుస్తున్నాయని వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించేందుకు అవసరమైతే కేంద్ర స్థాయిలో ఫిర్యాదు చేయనున్నట్టు ఎంపీ డీకే అరుణ మీడియాకు తెలిపారు..
