నీటిపారుదల లేని వర్షాధార భూమి.
జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి తొలకరి పలకరించి వెళ్లిపోయింది తొలకరి ఇచ్చిన భరోసాతో రైతు దుఃఖ దున్ని పొలంలో విత్తనాలు నాటాడు అరకొర పదునుతో విత్తనం మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది తగినంత పనులు లేకపోవడంతో మొక్క బయటకు రావడానికి నానా యాసల పడుతుంది.
మొక్క పైకి రావడానికి నలుగురికి కడుపు నింపడానికి కృషి చేస్తున్న రైతుకు మంచి ఆలోచన వచ్చింది. అర లీటర్ నీరు పట్టే పాలిథిన్ కవరు తీసుకొని దానికి నిండా నీళ్లు నింపి మూతికి దారం కట్టి విత్తు నాటిన దగ్గర ఒక్కొక్క చుక్క పడేలా చేశాడు అతను రైతు.
పేజీలకు పేజీలు చదివి డిగ్రీ పొందలేదు అతను శాస్త్రవేత్త కాదు సామాన్య రైతు అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు కానీ రైతు పరిస్థితి నానాటికి తీసిపోతుంది తినేవాళ్లే తప్ప పండించే వాళ్ళు కరువైతున్నారు అందుకే రూపాయికి అక్కరగాని వస్తువు 100 రూపాయల దాకా వెళ్ళిపోతుంది.
విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చి ప్రపంచ దేశాలలో మనదేశంలో కూడా వారంలో రెండు రోజులు విద్యార్థుల చేత ఫార్మింగ్ చేపించి వ్యవసాయపైన ఆవశ్యకత కల్పించకపోతే కాంక్రీట్ బిల్డింగ్ తప్ప తిండి పండించే పొలాలు కరువైపోతాయి ఇంకో 10 ఏళ్ల తర్వాత కిలో బియ్యం 300 రూపాయలు అయిన ఆశ్చర్యపోనవసరం లేదు
.
తొలకరి వర్షం మురిపించింది.
దుక్కి దున్నాడు.
అచ్చు తోలాడు.
విత్తు నాటాడు.
కాని మళ్ళా ఎండ మొదలైంది.
నేలలో పదును(తేమ) ఆరిపోతుంది.
ఉన్న పదును చాలక నానిన గింజ మొలక రావడానికి ప్రయాస పడుతుంది.
రెండు లీటర్లు నీళ్ళు పట్టే పాలిధిన్ కవర్లు తీసుకున్నాడు.
నీటితో నింపాడు.మూతి దగ్గర చిన్న బెజ్జం పెట్టాడు.
చుక్కా చుక్కా పడుతు నానిన గింజకు అందించేలా చేశాడు.
అతను ఇంజనీర్ కాదు..అతను శాస్త్రవేత కాదు..
అతనే రైతు..అతని కన్నా ఇంజనీర్లు,శాస్త్రవేతలు ఉన్నారా?
జై కిసాన్,