వికారాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సరదాగా వేటకు వెళ్లిన యువకులు చిక్కుల్లో పడ్డారు. చౌడపూర్ మండల పరిధిలో అడవిలో వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు ఊరికే ఉండక జాతీయ పక్షి నెమలిని వేటాడారు. అంతటితో ఆగలేదు. నెమలిని నిప్పుల మీద కాల్చుకుని తిన్నారు. విషయం ఆ నోట..ఈ నోట పాకి అటవీశాఖ అధికారుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది ఆ యువకులపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.
అయితే నెమలి చనిపోయి పడి ఉన్నయువకులు చెబుతున్నారు. విద్యుదాఘానికి గురై నెమలి మరణించింది. అది గమనించిన తండాకు చెందిన నీల్యా నాయక్, గోబ్రియానాయక్ లు నెమలిని అక్కడే కాల్చుకుని తిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ నెమలిని కాల్చుకుని తిన్న ఆనవాళ్లు లభించాయని తెలిపారు. దీనికి కారణమైన నీల్యానాయక్, గోబ్రినాయక్ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే వీరిద్దరూ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Tags
News@jcl