Telangana: ఆ పోస్టుకు విపరీతమైన డిమాండ్.. నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు..
ఒక్క వీసీ పోస్టు.. వందకుపైగా అప్లికేషన్లు. అవును వినడానికి కొంత వింతగా ఉన్నా ఇది వాస్తవం. అసలే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల నిధులు వచ్చాయి. దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని యూనివర్సిటీ. ఇంకేముంది ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ వీసీ పోస్టుకు తెగ డిమాండ్ ఏర్పడింది. పాలమూరు యూనివర్సిటీ వీసి పోస్ట్‌కి తీవ్ర పోటీ నెలకొంది.
Telangana: ఆ పోస్టుకు విపరీతమైన డిమాండ్.. నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు..
Palamuru University
ఒక్క వీసీ పోస్టు.. వందకుపైగా అప్లికేషన్లు. అవును వినడానికి కొంత వింతగా ఉన్నా ఇది వాస్తవం. అసలే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల నిధులు వచ్చాయి. దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని యూనివర్సిటీ. ఇంకేముంది ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ వీసీ పోస్టుకు తెగ డిమాండ్ ఏర్పడింది. పాలమూరు యూనివర్సిటీ వీసి పోస్ట్‌కి తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలోనే అత్యధిక అప్లికేషన్లు వచ్చిన వర్సిటిల్లో మూడో స్థానంలో ఉంది పీయూ. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం, ఇటీవలే వందకోట్ల నిధులు రాకతో ఈ పోస్ట్‌కి డిమాండ్ మరింత పెరిగింది. ఇక పోస్టు కోసం పొలిటికల్ రెఫరెన్స్‌ల కోసం నేతల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారందరూ వీసీ పోస్టులకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం పోస్ట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ తరువాత అత్యధికంగా పాలమూరు యూనివర్సిటీ వీసీ పోస్టుకే అప్లికేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే యూనివర్సిటీ ఉండటంతో మరింత ప్రాధాన్యం పెరిగింది. అయితే ఈ సారి పోటీ ఎక్కువగా ఉండటంతో వీసి పదవీ ఎవరిని వరిస్తుందో అనే చర్చ జోరుగా సాగుతోంది. వీసి నియామకంలో గతం నుండే రాజకీయ ప్రమేయం కీలకంగా ఉంది. చాలావరకు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పదవీ దక్కుతుందని టాక్ నడుస్తోంది. ఈ కారణంగా ఆశావాహులు అధికార పార్టీ నేతలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ ప్రస్తుత వీసి ప్రొఫెసర్ ఎల్ బి లక్ష్మి కాంత్ రాథోడ్ పదవీకాలం ఇటీవలే ముగిసింది. దీంతో వీసి పదవికి అర్హులైన వారు 159 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రొఫెసర్‌గా పదేళ్ళ అనుభవం.. ఎలాంటి వయో పరిమితి లేకపోవడంతో ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్స్, పీయూలో రిజిస్టార్‌గా పని చేసి ఇతర వర్సిటీలకు బదిలీపై వెళ్లిన వారు దరఖాస్తు చేశారు. అయితే ఈసారి వడపోత చాలా కఠినంగా ఉంటుందనే చర్చ సాగుతోంది. సీఎం సొంత జిల్లా కావడంతో పీయూపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లుగా సమాచారం. ప్రస్తుత వీసి కూడా మరోసారి అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారట. ఆయన హాయంలోనే వందకోట్ల నిధులు మంజూరు కావడం, సీఎం నియోజకవర్గంకు సంబంధించిన వ్యక్తి కావడం, అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా రాజకీయ ప్రమేయం లేకుండా విద్యార్థులకు మంచి సేవలు అందించే వారికే వీసీగా అవకాశం ఇవ్వాలని విద్యార్థులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు.
