కర్ణాటక లో పుణ్యక్షేత్రాలు చూడడానికి వెళ్లే వారికోసం రూట్ మ్యాప్ ను కూడా సేకరించడం జరిగింది అది కూడా మీకు అందిస్తున్నాను
మీరు ముందుగా గోకర్ణ చేరుకోండి
గోకర్ణ శ్రీ మహా గణపతి దేవ్ ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు
గోకర్ణ మహాబలేశ్వర్ (శివుని ఆత్మలింగ) ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు (గోకర్ణం నుండి మురుడేశ్వర్ 82 కిలోమీటర్లు)
మురుడేశ్వర్ శ్రీ మురుడేశ్వర స్వామి ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 3:00 నుండి 8:15 వరకు (మురుడేశ్వర్ నుండి కొల్లూర్ 61 కిలోమీటర్లు)
కొల్లూరు: శ్రీ మూకాంబిక ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 1:30 వరకు సాయంత్రం 5:00 నుండి 9:00 వరకు (కొల్లూర్ నుండి కోటేశ్వర్ 25 క కిలోమీటర్లు)
కోటేశ్వర: కోటిలింగేశ్వర ఆలయం: దర్శన సమయం: ఉదయం 05:00 నుండి రాత్రి 9:00 వరకు (కోటేశ్వర్ నుండి కుంభాషి 4 వరకు)
కుంభాసి ఆనెగుడ్డె శ్రీ వినాయక దేవాలయం: దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 8:30 వరకు (కుంభాషి నుండి శంకరనారాయణ 27 కిలోమీటర్లు)
శంకరనారాయణ: శ్రీ శంకరనారాయణ ఆలయం: దర్శనం ఉదయం 7:30 నుండి 12:30 మధ్యాహ్నం 4:30 నుండి 7:30 వరకు (శంకరనారాయణ నుండి ఉడుపి 45 కిలోమీటర్లు)
ఉడుపి శ్రీ కృష్ణ ఆలయం: దర్శనం ఉదయం 5:00 నుండి 11:00 వరకు సాయంత్రం 6:00 నుండి 9:00 వరకు (ఉడుపి నుండి శృంగేరి 83 కిలోమీటర్లు)
శృంగేరి శ్రీ శృంగేరి శారదా పీఠం: దర్శనం6:00 నుండి 2:00 వరకు 4:00నుండి 9:00 వరకు (శృంగేరి నుండి హొరనాడు 41 కిలోమీటర్లు)
హొరనాడు అదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం: దర్శనం ఉదయం 6:30 నుండి 9:00 వరకు, మధ్యాహ్నం 11:00 నుండి 2:00 వరకు, రాత్రి 7:00 నుండి 9:30 వరకు (హొరనాడు నుండి ధర్మస్థల 91 కిలోమీటర్లు)
ధర్మస్థల శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 2:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:30 వరకు(ధర్మస్థలం నుండి కుక్కేసుబ్రహ్మణ్యం 54 కిలోమీటర్లు)
కుక్కే శ్రీ అది సుబ్రహ్మణ్య ఆలయం: దర్శనం ఉదయం 6:30 నుండి 1:30 మధ్యాహ్నం 3:30 నుండి 8:30 వరకు
కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం: దర్శనం ఉదయం 6:30 నుండి 1:30 మధ్యాహ్నం 3:30 నుండి 8:30 వరకు..
Tags
News@jcl
