ప్రధాని మోదీ రోడ్ షో‌లో కూలిన స్టేజి.. పలువురికి గాయాలు*

 *ప్రధాని మోదీ రోడ్ షో‌లో కూలిన స్టేజి.. పలువురికి గాయాలు*





మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆదివారం రోడ్ షో సందర్భంగా ఘటన


మోదీని చూసేందుకు అనేక మంది స్టేజి ఎక్కిన వైనం


స్టేజీ ఒక్కసారిగా కూలడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు


బాధితుల ఆరోగ్యం గురించి మోదీ ఆరా


మధ్యప్రదేశ్‌లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో సందర్భంగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టేజీ కూలడంతో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. జబల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఈ ఘటన జరిగింది. ‘‘మోదీ ర్యాలీ తరువాత..ఓ స్టేజీ కూలింది. జనాలు భారీగా స్టేజీ ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వాళ్లందరినీ ఆసుపత్రికి తరలించాము’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రధాని తనకు రెండు సార్లు ఫోన్ చేసి గాయపడ్డవారి బాగోగుల గురించి ఆరా తీశారని పీడబ్ల్యూడీ మంత్రి రాకేశ్ సింగ్ తెలిపారు. బాధితులకు కావాల్సినవన్నీ అందించాలని ఆదేశించారని తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow