Telangana: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్‌లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు (Former Minister Srinivas Goud) హైకోర్టులో (Telangana HighCourt) చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్‌లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్‌మెన్‌లు అవసరమో? లేదో? తెలపాలని డీజీపీకి (Telangana DGP) హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ... తదుపరి విచారణను మార్చ్ 19కి వాయిదా వేసింది.
