Telangana: మోదీని పెద్దన్న అంటున్న రేవంత్.. బీజేపీ, కాంగ్రెస్ బంధం బట్టబయలైందన్న BRS
CM Revanth: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి
Telangana: రాష్ట్రాభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జిల్లా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు.
ఆదిలాబాద్, మార్చి 4: రాష్ట్రాభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి (PM Narendra Modi) కృతజ్ఞతలు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సోమవారం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జిల్లా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఎన్‌టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం
అంతకుముందుకు.. జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపు రూ.6వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా మోదీ శంకుస్థాపన చేశారు. రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. అండర్ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్- బేల- మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో బడేభాయ్ చోటే భాయ్ ముచ్చట... హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనతో.. మొత్తంగా పొలిటికల్ సీన్ మారేట్టు కనిపిస్తోంది. అధికారిక కార్యక్రమంలో అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. బడేబాయ్ అని రేవంత్ అంటే... కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు ఎక్కుపెట్టారు మోదీ. మరోవైపు, జాతీయ పార్టీల దోస్తీ బయటపడిందని ఆరోపిస్తోంది బీఆర్‌ఎస్.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిరోజు పర్యటన… రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానితో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్… మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశప్రధాని తమకు పెద్దన్నలాంటి వారంటూ.. ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్.. ఇప్పుడు పొలిటికల్‌గా అగ్గిరాజేశాయి.
అయితే, రేవంత్ అలా పొగిడి వెళ్లారో లేదో … ఆ కొద్దిసేపటికే ఆదిలాబాద్ బహిరంగసభలో కాంగ్రెస్‌ను ఏకిపారేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూదొందేనంటూ… ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ రాకతో తెలంగాణలో జరిగే మార్పేమీ ఉండబోదన్నారు.
ప్రధాని మోదీని బడేభాయ్ అంటూ సంబోధించిన రేవంత్‌పై.. బీఆర్‌ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. కేంద్రవిధానాల్ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే.. ఇక్కడ రేవంత్ మాత్రం పొగిడేస్తు్న్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్, బీజేపీల బంధం… రేవంత్ వ్యాఖ్యలతో బట్టబయలైందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత.
మరి, మరో రోజు ప్రధాన పర్యటన మిగిలి ఉండగానే.. ఈ స్థాయిలో రాజకీయ వేడి రగిలింది. రెండో రోజు తర్వాత.. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.