జడ్చర్ల లోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి.
గురువారం రోజు టి. ఎస్. కే. సి మరియు ఈ.డి.పి సెల్ ( డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ) ఆధ్వర్యంలో విద్య వైజ్ఞానిక యాత్ర భాగంగా గచ్చిబౌలి లోని టి - హబ్ వెళ్ళారు.
ఒక ఐడియా వస్తే దానిని ఏ విధంగా ఆచరణలో పెట్టాలో మా టీ-హబ్ వాళ్ళు మీకు సహాయం చేస్తారు.
అని హరీష్ మరియు సుదర్శన్ మొదలగు ఉద్యోగులు అక్కడ విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు. విద్యార్థులు ఎంతో ఆశ్చర్యంతో టి- హబ్ ని పరిశీలించడం జరిగింది. రుచికరమైన ఆహారం కూడా తిన్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు .
ఈ వైజ్ఞానిక యాత్రకి హెచ్ ఓ డి ఆఫ్ కామర్స్, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంజుల , టిఎస్. కే.సి. కోఆర్డినేటర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ .డాక్టర్ ఆర్ . రమాదేవి, అధ్యాపకులు వెంకటరెడ్డి ,వనిత, శంకర్, టీ.ఎస్. కే. సి మార్గదర్శకులు ప్రతాప్ , 40 మంది బి.కామ్. విద్యార్థులు వెళ్ళినందుకు ప్రిన్సిపల్ డాక్టర్ అఫియా చిన్నమ్మ అభినందనలు తెలియజేశారు..
