వడ్డీ వ్యాపారి మ్యాదరి రవిని పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్

 తాండూర్ పట్టణంలో డబ్బుల విషయం లో ఒక వ్యక్తి పై దాడి చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియా లో వైరల్ చేసిన వడ్డీ వ్యాపారి మ్యాదరి రవిని పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు...



వికారాబాద్: వడ్డీ వ్యాపారుల (Moneylender) ఆగడాలు శృతి మించుతున్నాయి. అవసరం ఉందని డబ్బు తీసుకుంటే వడ్డీకి వడ్డీ (Interest) జమ చేసి ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు. మరికొందరు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లాలో జరిగింది. తీసుకున్న నగదు ఇవ్వడం లేదని, వడ్డీ కూడా కట్టడం లేదని ఒకతినిపై ఓ వడ్డీ వ్యాపారి (Moneylender) దాడికి తెగబడ్డారు. చేతులతో కొడుతూ, కాళ్లతో తంతూ విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.






Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow