కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు.. అభివృద్ధికి ఆటంకమే: రేవంత్‌

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు.. అభివృద్ధికి ఆటంకమే: రేవంత్‌




ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలుకుతున్నాన్నారు


తెలంగాణ అభివృద్ధికి గత పదేళ్లుగా కేంద్రం సహకరిస్తోందన్నారు..ప్రధాని మోదీ. ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా.. 6 వేల 697 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు..ప్రధాని మోదీ. NTPC ప్రాజెక్ట్‌ సెకండ్‌ ఫేజ్‌ విద్యుత్‌ప్లాంట్‌ జాతికి అంకితం చేశారు. అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని. అండర్‌ డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌-బేల-మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు కూడా సభలో భూమిపూజ చేశారు ప్రధాని మోదీ. ప్రధాని సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలుకుతున్నాన్నారు. విభజన హామీ మేరకు NTPC 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి కుంటుపడుతుందన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేయాలని అన్నారు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow