ఫ్లాష్ ఫ్లాష్* *💥బిజెపి నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి మరికాసేపట్లో "సీఎం రేవంత్ రెడ్డి"*

 *💥



*మహబూబ్ నగర్*:-మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్టు తెలిసింది. మరి కాసేపట్లో ఆయనతో కీలక భేటీ జరగనున్నట్టు సమాచారం. జితేందర్ రెడ్డి బిజేపి పార్లమెంటు సీటు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కలుసుకోవడానికి స్వయంగా ఇంటికి వెళ్తుండడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు చేశారు. మరోవైపు బిజెపి డీకే అరుణకు అవకాశం కల్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని విశ్వసినీయ సమాచారం. కీలక పరిణామాలు చోటుచేసుకున్న ఈ దరిమిలా మరికాసేపట్లో పూర్తి సమాచారం మీ ముందుకు.. ..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow