రిజర్వేషన్ అభ్యర్థులకు శుభవార్త
గతంలో 45% మార్కులు తప్పనిసరి
టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలు
జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకటన
తొలిరోజు 500 దరఖాస్తులు
బీఈడీ, డీఈడీ చదువుతున్న వారూ..
దరఖాస్తులకు అర్హులే.. పాత సిలబ్‌సతోనే పరీక్షలు
రిజర్వేషన్ అభ్యర్థులకు.. ఇంటర్‌లో 40% వచ్చినా ఎస్‌జీటీకి అర్హులే
హైదరాబాద్, : సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్‌సజీటీ) పోస్టులకు పోటీ పడే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శుభవార్త..! ఈ కేటగిరీ వారికి ఇంటర్‌లో అర్హత మార్కుల శాతాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలను రూపొందించింది. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను.. సబ్జెక్టుల వారీగా పోస్టుల సంఖ్యను ప్రకటించింది. పాత సిలబస్ ప్రకారమే డీఎస్సీని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తొలిరోజు 500 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎస్‌జీటీ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు ఇంటర్‌లో కనీస అర్హత మార్కులు జనరల్ కేటగిరీకి 50ు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45శాతంగా ఉండేది. తాజా మార్గదర్శకాల్లో రిజర్వేషన్ కేటగిరీ(ఎస్సీ, ఎస్టీ, బీసీ)కి ఇంటర్‌లో అర్హత మార్కులను 40శాతానికి తగ్గించారు. ఇక స్కూల్ అసిస్టెంట్(ఎ్‌సఏ) పోస్టులకు పోటీపడే అభ్యర్థులు జనరల్ కేటగిరీకి 50ు, రిజర్వేషన్ కేటగిరీకి 45ు మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం బీఈడీ, డీఈడీ వంటి ఉపాధ్యాయ కోర్సులను చదువుతున్న వారికీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. అయితే.. వీరంతా ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాటికి వీరు బీఈడీ/డీఈడీ పూర్తిచేసి ఉండాలి.
త్వరలో ఎడిట్ ఆప్షన్!
ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒకట్రెండు రోజుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గత నోటిఫికేషన్ ప్రకారం వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో సొంత జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉన్నవారు పక్క జిల్లాల్లో పోస్టులకు దరఖాస్తులను సమర్పించారు. గతంలో దరఖాస్తు చేసిన వారు ఇప్పుడు మరోమారు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే.. సొంత జిల్లాల్లో పోస్టులు పెరిగిన నేపథ్యంలో.. గత దరఖాస్తులో అభ్యర్థులు మార్పులు చేయడానికి సాఫ్ట్‌వేర్ అనుమతించడం లేదు. అలాంటి వారికి ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు.
సీఎం గారు.. మాకు ఉద్యోగాలు ఇప్పించండి
గురుకుల పోస్టులకు ఎంపికైనా హోల్డ్‌లో పెట్టారంటూ ‘బీటెక్ బీఈడీ’ అభ్యర్థుల ఆవేదన
పంజాగుట్ట: ‘కష్టపడి బీటెక్ చదివాం.. టీచర్ కావాలనే ఆశతో బీఈడీ చేశాం. ప్రభుత్వం నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసి ఎంపికయ్యాం. కానీ మమ్మల్ని హోల్డ్‌లో పెట్టారు. సీఎం గారు స్పందించి మాకు ఉద్యోగాలిచ్చి ఆదుకోండి’ అని బీటెక్ బీఈడీ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీటెక్, బీఈడీ చదివి ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన రాఘవేంద్ర, అపర్ణ, వినీత, శివానీ రాథోడ్ తదితరులు మాట్లాడారు. గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షలో బీటెక్, బీఈడీ అభ్యర్థులు 97 మంది ఎంపికైనట్లు చెప్పారు. కొలువు వచ్చిందన్న సంతోషంలో ఉండగానే అందరినీ హెల్డ్‌లో పెట్టారన్నారు. మిగతా వారికి సోమవారం ఎల్బీ స్టేడియంలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారని, రేవంత్ ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని కోరారు.

